Sunday, February 5, 2023

మలయాళ ఇండ‌స్ట్రీలో అడుగుపెట్టిన‌ మైత్రీ మూవీ మేకర్స్.. ఫ‌స్ట్ మూవీ ఫస్ట్ లుక్‌ రిలీజ్

టాలీవుడ్ లో అత్యద్భుతమైన సినిమాల‌ను నిర్మిస్తున్న ప్ర‌ముఖ నిర్మాన సంస్థ‌ మైత్రీ మూవీ మేకర్స్ వారి స‌ర్కిల్ పెంచుకునేందుకు ప్ర‌య‌త్నిస్తోంది. తెలుగులోనే కాకుండా ఇత‌ర భాషా సినిమాలను నిర్మించేందుకు మొగ్గు చూపుతోంది. ప్ర‌స్తుతం మ‌ల‌యాళంలో ఒక సినిమాని చేస్తోంది ఈ సంస్థ‌. మలయాళ నటుడు టోవినో థామస్‌తో ”నడికర్ తిలగం” అనే మూవీని నిర్మిస్తున్నారు మైత్రీ మూవీ మేక‌ర్స్. కాగా, ఆ సినిమాకి సంబందించిన ఫ‌స్ట్ లుక్ ని ఇవ్వాల రిలీజ్ చేశారు.

- Advertisement -
   

డ్రైవింగ్ లైసెన్స్ ఫేమ్ లాల్ జీన్ పాల్ దర్శకుడు. పుష్ప మేకర్స్‌తో కలిసి అల్లన్ ఆంటోని, అనూప్ వేణుగోపాల్ ఈ సినిమాని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సౌభిన్ షాహిర్ మరో ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. యక్జాన్ గారి పెరీరా, నేహా ఎస్ నాయర్ స్వరాలు సమకూరుస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement