Sunday, May 5, 2024

ఖ‌లీస్థాన్ సానుభూతిప‌రుడు అమృత్ పాల్ సింగ్ అరెస్ట్

చండీగ‌డ్ – ఖ‌లీస్థాన్ సానుభూతి ప‌రుడు , మోస్ట్ వాటెండ్ క్రిమిన‌ల్ అమృత్‌పాల్ ను పంజాబ్ పోలీసులు నేటి ఉద‌యం అరెస్ట్ చేశారు. అమృత్‌పాల్‌ అరెస్టు ఆపరేషన్‌ను నిన్న రాత్రి నుంచి పంజాబ్‌ సీఎం భగవంత్‌మాన్‌ స్వయంగా పర్యవేక్షించినట్లు సమాచారం. ఆదివారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో పోలీసులు అమృత్‌పాల్ ఉన్న రోడె గ్రామంలోని గురుద్వారాలో చుట్టుముట్టారు.. పోలీసులు గురుద్వారాలోకి వెళ్ల‌కుండానే అమృత‌పాల్ ను బ‌య‌ట‌కు ర‌ప్పించారు..


ఈ అరెస్ట్ గురించి పంజాబ్ ఐజిపి సుఖ్ చైన్ సింగ్ గిల్ మీడియాకు వివ‌రాలు అందించారు.. అమృత‌పాల్ పై జారీ చేసిన నేషనల్‌ సెక్యూరిటీ యాక్ట్‌ వారెంట్‌ను నేటి ఉదయం అమలు చేశామని పేర్కొన్నారు. ఇందుకోసం పంజాబ్‌ పోలీసులు, ఇంటెలిజెన్స్‌ విభాగం సంయుక్తంగా ఆపరేషన్‌ చేపట్టాయన్నారు. పంజాబ్‌ పోలీసులకు వచ్చిన ముందస్తు సమాచారం ఆధారంగానే ఈ అరెస్టు జరిగిందన్నారు. రోడెలోని గురుద్వారా పవిత్రతకు భంగం వాటిల్లకూడదని తాము లోపలకు ప్రవేశించలేదని వివరించారు. అతడిని డిబ్రూగఢ్‌కు తరలించి ఈ కేసులో చట్టప్రకారం చర్యలు తీసుకొంటామని వెల్లడించారు. అతడు లొంగిపోయాడనే ప్రచారాన్ని ఐజీపీ తోసిపుచ్చారు..
మరోవైపు అస్సాంలోని డిబ్రూగఢ్‌ విమానాశ్రయంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. అమృత్‌పాల్‌ను ప్రత్యేక విమానంలో పంజాబ్‌ నుంచి ఇక్కడికి తరలిస్తున్నారు. విమానాశ్రయంలో ప్రత్యేక పోలీసు బృందాలు అతడిని తమ ఆధీనంలోకి తీసుకుని డిబ్రూగఢ్‌ సెంట్రల్‌ జైలుకు తరలిస్తాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement