Wednesday, May 1, 2024

క‌స్ట‌డీ మూవీ అప్ డేట్

హీరో నాగ‌చైత‌న్య న‌టిస్తున్న చిత్రం క‌స్ట‌డీ..ఈ చిత్రం నుండి టైమ్ లెస్ ల‌వ్ లిరికల్‌ వీడియో సాంగ్‌ను లాంఛ్ చేశారు.రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటను యువన్‌ శంకర్‌ రాజా, కపిల్ కపిలన్‌ పాడారు. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదల చేసిన టీజర్‌ టీజ్‌, గ్లింప్స్ వీడియో, టీజర్‌ నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.హీరో నాగచైత‌న్య నటిస్తోన్న చిత్రం ఇది. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వెంకట్ ప్రభు డైరెక్ట్ చేస్తున్నాడు.శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యాన‌ర్‌పై శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కస్టీకి మ్యూజిక్‌ మ్యాస్ట్రో ఇళ‌య‌రాజా, యువ‌న్ శంక‌ర్ రాజా సంగీతం అందిస్తున్నారు. కస్టడీ మే 12న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. తెలుగు, తమిళ భాష‌ల్లో NC 22గా తెరకెక్కుతున్న ఈ మూవీ నుంచి ముందుగా అందించిన అప్‌డేట్ ప్రకారం తాజాగా టైమ్‌లెస్‌ లవ్‌ కస్టడీ నుంచి ఇప్పటికే లాంఛ్ చేసిన హెడ్‌ అప్ హై లిరికల్‌ వీడియో సాంగ్‌కు మంచి స్పందన వస్తోంది. ఈ చిత్రంలో నాగచైతన్యకు జోడీగా కృతిశెట్టి నటిస్తోంది. కస్టడీలో నాగచైతన్య పోలీసాఫీసర్‌ శివగా కనిపించబోతున్నాడు. ఈ మూవీలో టాలెంటెడ్‌ యాక్టర్ అరవింద్‌ స్వామి విలన్‌గా నటిస్తుండగా.. వెన్నెల కిశోర్‌, శరత్‌కుమార్‌, ప్రేమ్‌గీ అమ‌రేన్‌, సంప‌త్ రాజ్, ప్రియమణి కీల‌క పాత్రల్లో నటిస్తున్నారు.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement