Thursday, April 25, 2024

అమితాబ్ బ‌చ్చ‌న్ నే.. ఇంప్రెస్ చేసిన బుడ్డోడు

కౌన్ బ‌నేగా క‌రోడ్ ప‌తి లేటెస్ట్ ఎపిసోడ్ లో పోటీదారుడిగా ఓ బుడ్డోడు పాల్గొన్నారు. ఆ చిన్నారి పేరు ఆదిత్య శ్రీవాస్తవ. ఆదిత్య నాలెడ్జ్ కి ఈ షో హోస్ట్ అమితాబ్ బచ్చన్ ఇంప్రెస్ అయ్యారు. ఇస్రోలో పనిచేయడం తన ఆశయం అని ఆదిత్య అమితాబ్ బచ్చన్ కి తెలిపారు. అలాగే అమితాబ్.. ఆదిత్యకి ఇన్ఫోసిస్ ఛైర్మన్ నారాయణ మూర్తి సతీమణి సుధా మూర్తిని పరిచయం చేశారు. సుధా మూర్తి ఎన్నో రచనలు చేసిన సంగతి తెలిసిందే. ఆదిత్య.. సుధా మూర్తితో మాట్లాడుతూ మీ రచనలు చదివానని తెలిపారు. అలాగే బ్రిటన్ కి కొత్తగా ప్రధానిగా భాద్యతలు చేపట్టిన సుధా మూర్తి అల్లుడు రిషి సునాక్ కి ఆదిత్య శుభాకాంక్షలు తెలిపాడు. దీనితో సుధా మూర్తి స్పందించారు. నీ విషెష్ ని రిషి సునాక్ కి మెసేజ్ రూపంలో పంపిస్తానని హామీ ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement