Friday, February 3, 2023

ఫ్యామిలీతో విహార యాత్ర.. హీరోయిన్‌తో వీరయ్య యాత్ర.. చిరంజీవి ట్వీట్

వాల్తేరు వీర‌య్య మూవీ షూటింగ్ చివ‌రి ద‌శ‌లో ఉంది. ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి ప్ర‌ధాన పాత్ర‌ని పోషిస్తున్నారు. తాజాగా ఈ చిత్రంలో రెండు పాటల చిత్రీకరణ కోసం మెగాస్టార్ చిరంజీవి, హీరోయిన్ శ్రుతి హాసన్ తో పాటు చిత్ర యూనిట్ యూరప్ వెళ్లింది. అక్కడ వండర్ ఫుల్ లోకేషన్స్ లో రెండు పాటలని చిత్రీకరించనున్నారు.. తాజాగా మెగా మూవీ రిలీజ్‌ డేట్‌ను కూడా ప్రకటించింది చిత్రబృందం. సంక్రాంతి కానుకగా జనవరి 13న గ్రాండ్‌గా వాల్తేరు వీరయ్య థియేటర్లలోకి అడుగుపెట్టనున్నాడు. ఈ సినిమా షూటింగ్ కోసం మెగాస్టార్ చిరంజీవి విదేశాలకు బయలుదేరాడు. ఆయనతో పాటు సతీమణి సురేఖ, కూతురు సుష్మిత పిల్లలు ఉన్నారు. కాగా తన ఫారిన్‌ ట్రిప్‌ విషయాన్ని ట్విటర్‌లో షేర్‌ చేసుకున్నారు మెగాస్టార్‌. అదేవిధంగా షూటింగ్‌ కోసం శృతిహాసన్‌తో కలిసి వెళుతున్న ఫొటోను పంచుకున్నారు. ‘ఫ్యామిలీతో అటు విహార యాత్ర.. హీరోయిన్‌తో ఇటు వీరయ్య యాత్ర..’ అంటూ దీనికి క్యాప్షన్ ఇచ్చారు మెగాస్టార్.

Advertisement

తాజా వార్తలు

Advertisement