Saturday, May 4, 2024

అమిత్‌ షా రహస్య సర్వే.. క‌ర్నాట‌క బీజేపీ ఎమ్మెల్యేల‌పై రిపోర్టు ఏంటంటే..

రాష్ట్ర శాసనసభ ఎన్నికలు వచ్చే ఏడాది రానున్న నేపథ్యంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా రాష్ట్రంలోని సిట్టింగ్‌ బిజెపి ఎమ్మెల్యేలపై సమగ్ర సర్వే జరిపించినట్టు తెలుస్తోంది. 30 మంది ఎమ్మెల్యేలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేక ఉందని వారు మరోసారి గెలుపొందే అవకాశాలు అంతంత మాత్రమేనని సర్వే తేల్చినట్టు తెలుస్తోంది. ఇప్పటికే అమిత్‌ షా చేతికి చేరిన సర్వే నివేదికను అమలు చేస్తే 30 మంది సిట్టింగ్‌లకు టికెట్లు దక్కవని సమాచారం. రాష్ట్ర బీజేపీలో ఈ అంశం హల్‌ చల్‌ చేస్తోంది. ఓ ప్రయివేటు ఏజెన్సీకి చెందిన 150 మంది ప్రతినిధులు మే 1 నుంచి 15 వ తేదీవరకు ప్రతి శాసన సభ నియోజక వర్గంలోనూ పర్యటించి అత్యంత రహస్యంగా నివేదికను సిద్దం చేసిననట్టు తెలుస్తోంది.

గడచిన పదేళ్లలో బీజేపీ వర్చస్సు దేశమంతా వెలిగింది. దక్షిణ భారత్‌లో బీజేపీకి అవకాశం ఉండేది ఏకైక రాష్ట్రం కర్నాటకనే. శాసన సభ ఎన్నికల ద్వారా విజయం సాధించి 2024లో జరిగే లోక సభ ఎన్నికలకు పునాది వేసుకోవాలని భావిస్తున్నారు. ఇలా ఓటమి తప్పదనే అభ్యర్థులను పక్కన పెట్టి కొత్తవారిపట్ల మరో సర్వే జరిపించే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ప్రస్తుత సర్వే ప్రకారం 30 మంది సిట్టింగ్‌లకు టికెట్‌లు దక్కవనేది స్పష్టమవుతోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement