Monday, May 6, 2024

అమిత్‌ షా, ఎన్టీఆర్‌ భేటీకి రాజకీయ ప్రాధాన్యత లేదు : కిషన్ రెడ్డి

మునుగోడు స‌భ‌కు విచ్చేసిన కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాతో నటుడు జూనియర్‌ ఎన్టీఆర్‌ భేటీ అయ్యారు. వీరి సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకోవడంతో పాటు పలు రకాల అనుమానాలు వస్తుండడంతో ఇద్దరి భేటీపై కిషన్‌రెడ్డి స్పందించారు. వీరి భేటీ వెనుక రాజకీయ ప్రాధన్యత లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. వీరిద్దరి సమావేశం రాజకీయాలకు ఏ మాత్రం సంబంధం లేదని స్పష్టం చేశారు. సినిమాలకు సంబంధించిన చర్చ మాత్రమే జరిగిందని అన్నారు. అల్లూరి జిల్లా చింతపల్లి పోలీసు స్టేషన్‌పై అల్లూరి దాడిచేసి వందేళ్లు పూర్తయిన దృష్టా శత జయంతి ఉత్సవాలను కేంద్ర ప్రభుత్వం, క్షత్రియ సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ ఉత్సవాలకు కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, అర్జున్‌ముండా, ఏపీ డిప్యూడీ సీఎం రాజన్న దొర హాజరయ్యారు. సందర్భంగా 9 అడుగుల అల్లూరి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం మీడియాతో కిషన్‌ రెడ్డి మాట్లాడారు. నిన్న తెలంగాణలోని మునుగోడులో నిర్వహించిన బీజేపీ బహిరంగ సభకు హాజరయ్యేందుకు వచ్చిన అమిత్‌ షా రాత్రి జూనియర్‌ ఎన్టీఆర్‌తో దాదాపు 30 నిమిషాల పాటు సమావేశమయ్యారు. వీరి సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకోవడంతో పాటు పలు రకాల అనుమానాలు వస్తుండడంతో ఇద్దరి భేటీపై కిషన్‌రెడ్డి స్ప‌ష్ట‌త‌నిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement