Wednesday, May 1, 2024

ఈ చిత్రంలో చాలా విశేషాలున్నాయి..

ఎస్వీ కృష్ణారెడ్డి తాజా చిత్రం ‘ఆర్గానిక్‌ మామ హైబ్రిడ్‌ అల్లుడు’. రాజేం ద్రప్రసాద్‌ , మీనా ప్రధాన పాత్రధారులు. కె. అచ్చిరెడ్డి సమర్పకులు. కోనేరు కల్పన నిర్మిసున్నారు. ‘బిగ్‌బాస్‌’ ఫేం సోహెల్‌, మృణాళిని హీరో, హీరోయిన్‌లు. మార్చి 3న ఈ చిత్రం ప్రేక్షకులు ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించింది చిత్ర యూనిట్‌.
దర్శకులు ఎస్వీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ ”ఈ చిత్రంలో విశేషాలు ఉన్నాయి. ప్రేక్షకుల్ని నవ్వుల్లో ముంచెత్తటానికే ప్రతి క్యారెక్టర్‌ రాసుకోవడం జరిగింది. తెరమీద పాత్రలు మిమ్మల్ని నవ్విస్తుంటే.. మీరు నవ్వుతూ ఉంటే చూడాలని నేను మార్చి 3వ తేదీ కోసం ఎదురు చూస్తున్నాను.” అన్నారు.
ప్రముఖ నిర్మాత సి. కల్యాణ్‌ మాట్లాడుతూ ”అందరూ అంటు-ంటారు… ఆ తరం ఐపోయింది. ఈ తరం ఐపోయింది అని. కానీ నా దృష్టిలో తరాలు మారొచ్చు గానీ.. సినిమా అనేది నిరంతరం సాగే ప్రపంచం.” అన్నారు. కె. అచ్చి రెడ్డి మాట్లాడుతూ” ఈ సినిమా అద్భుతంగా రావటానికి ఏం చేయాలో అది ఎవరి పరిధిలో వారు ది బెస్ట్‌ అన్నట్టు-గా చేశారు.” అన్నారు.
హీరో సోహైల్‌ మాట్లాడుతూ ” ఈ సినిమాలో నటించడం నా అదృష్టంగా భావిస్తాను అని చాలాసార్లు చెప్పాను.” అన్నారు. ఇంకా విలక్షణ నటు-డు అజయ్‌ ఘోష్‌, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, సురేష్‌ కొండేటి మాట్లాడారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement