Thursday, May 2, 2024

అమెజాన్‌లో లక్ష మంది ఉద్యోగుల తొలగింపు…

ప్రముఖ ఆన్‌లైన్‌ ఈ కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ లక్ష మంది ఉద్యోగులను తొలగించనుందని తెలుస్తోంది. ఆర్థిక మాంధ్యం భయాల కారణంగా ఖర్చులు తగ్గించుకునేందుకు ఇప్పటికే పలు కంపెనీలు భారీ సంఖ్యలో ఉద్యోగులను తగ్గిస్తున్నాయి. అమెజాన్‌ చరిత్రలో తొలిసారి ఇంత భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించాలని నిర్ణయిందని వార్తలు వస్తున్నాయి.
అమెజాన్‌ వార్షిక ఆర్ధిక ఫలితాల నేపధ్యంలో ఆ సంస్థ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ అధికారి బ్రియాన్‌ ఒల్సావ్స్కీ ఈ విషయంలో చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అమెజాన్‌లో పని చేస్తున్న మొత్తం సిబ్బంది 15 లక్షల మందిలో లక్ష మంది వరకు విధుల నుంచి తొలగించనున్నట్లు ప్రకటించారు. తొలగించిన వారిలో ఫుల్‌ఫిల్‌మెంట్‌, సెంటర్‌, డిస్టిబ్యూషన్‌ నెట్‌వర్క్‌ ఉద్యోగులు ఎక్కువగా ఉన్నారు. కొత్తగా సిబ్బందిని నియమించుకోవడాన్ని కూడా తగ్గిస్తున్నట్లు తెలిపారు.

గత సంవత్సరం ఇలాంటి కారణాలతోనే అమెజాన్‌ 27 వేల మంది ఉద్యోగులను తొలగించింది. ఒమిక్రాన్‌ వేరియంట్‌ వచ్చిన సమయంలో బిజినెస్‌ పెంచుకోవడానికి పెద్ద సంఖ్యలో ఉద్యోగులను రిక్రూట్‌ చేసుకుంది. ఉద్యోగు విషయంలో కంపెనీ పారదర్శంగానే ఉందని ఆయన చెప్పారు. ఈ త్రైమాసికంలో కొత్తగా కంపెనీ 14 వేల మంది ఉద్యోగులను తీసుకుందని ఆయన తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement