Wednesday, October 9, 2024

ఆలీ ఇంట పెళ్లి సందడి.. ఘనంగా కుమారై హల్దీ వేడుక

నటుడు ఆలీ ఇంట్లో పెళ్లి సందడి ప్రారంభమయింది. ఆయన కుమార్తె ఫాతిమా మరికొన్ని రోజుల్లో పెళ్లి పీటలెక్కనుంది. సినిమా పరిశ్రమకు చెందిన అలీ తన కూతురును.. కుటుంబం మొత్తం వైద్యులతో నిండిన ఒక ఫ్యామిలీకి కోడలిగా పంపించనున్నారట. ఫాతిమాకు కాబోయే వరుడు కూడా డాక్టరేనట. దీంతో కుమార్తె పెళ్లి పనుల్లో బిజి బిజీగా మారిపోయారు అలీ దంపతులు. పెళ్లి వేడుకల్లో భాగంగా ఫాతిమా హల్దీ వేడుకను ఘనంగా నిర్వహించారు. దీనికి సంబంధించిన వీడియోను అలీ సతీమణి తన యూట్యూబ్‌ ఛానెల్‌లో షేర్‌ చేయగా అది కాస్తా వైరలగా మారింది.

ఇందులో అలీ, జుబేదా దంపతులు, వారి పిల్లలు, బంధువులు.. ముఖానికి పసుపు పూసుకుని బాగ్‌ ఎంజాయ్‌ చేయడమం మనం చూడవచ్చు. అయితే అతి కొద్ది మంది బంధువులు, సన్నిహితుల సమక్షంలోనే ఈ వేడుక జరిగింది. హల్దీ వేడుకలకు కేవలం అలీ కుటుంబ సభ్యులు, బంధువులు మాత్రమే హాజరయ్యారు. అయితే వివాహానికి మాత్రం చాలా గ్రాండ్‌గా ఏర్పాట్లు చేస్తున్నారు. రెండు రాష్ట్రాల నుంచి రాజకీయ ప్రముఖులు, ఇండస్ట్రీ నుంచి పలువురు పెద్దలు ఈ పెళ్లి వేడుకకు హాజరు కానున్నారు. కాగా అలీ కుమార్తె ఫాతిమా రెమీజు మెడిసిన్ చదువుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement