Thursday, April 25, 2024

మత్స్యకారుల బ్రతుకుల్లో కొత్త వెలుగులు : ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్

మత్స్యకారుల బతుకుల్లో కొత్త వెలుగులు నిండాయని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. ఖిలా వరంగల్ గుండు చెరువు, దేశాయిపేట లోని చిన్న వడ్డెపల్లి చెరువు, కోట చెరువుల్లో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న చేప పిల్లల పంపిణీ కార్యక్రమంలో భాగంగా చెరువులో చేపలు వదిలారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ చెరువులను పునరుద్ధరించి చెరువులకు కొత్త కళ తీసుకొచ్చారన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టికి చెరువులే ఆధారం అని, ఆ చెరువులను బాగు చేయడం ద్వారా కుల వృత్తులకు ముఖ్యమంత్రి కేసీఆర్ జీవం పోశారన్నారు. చెరువులో చేప పిల్లల పంపిణీ ద్వారా మత్స్యకారులకు ఆర్థిక పరిపుష్టి సాధించి వారి ఎదుగుదలకు తోడ్పాటు అందిస్తున్నారన్నారు. తెలంగాణ సాధించిన ఫలాలు పేద ప్రజలకు అందజేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పంతో సంక్షేమం అభివృద్ధిలో దేశంలోనే ముందు వరుసలో నిలిపారు. ఎవరెన్ని కుట్రలు చేసినా తెలంగాణ అభివృద్ధి అడ్డుకోలేరు, ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అన్ని రంగాల్లో మరింత ముందుకు వెళుతుంద‌న్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గం అన్ని నియోజకవర్గాలకు దీటుగా అభివృద్ధి చేస్తున్నాం, ఒకవైపు సంక్షేమం మరోవైపు అభివృద్ధి ఫలాలను ప్రజలకు అందజేస్తున్నామ‌న్నారు. పేదరికం నిర్మూలించడం ఎజెండాగా పని చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు బైరబోయిన ఉమ దామోదర్ యాదవ్, బోగి సువర్ణ సురేష్, సురేష్ జోషి, కావటి కవిత రాజుయాదవ్, మాజీ కార్పొరేటర్ బయ్య స్వామి, సంగరబోయిన చందర్, చింతాకుల సునీల్, మత్సకార సొసైటీ ప్రతినిధులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement