Wednesday, May 1, 2024

గూచీకి బ్రాండ్ అంబాసిడర్ గా ఆలియాభట్.. ప్రకటించిన సంస్థ

బాలీవుడ్ హీరోయిన్ ఆలియాభట్ ని తమ బ్రాండ్ కి అంబాసిడర్ గా నియమించింది గూచీ సంస్థ.. సెలబ్రిటీలతో తమ బ్రాంచ్ ని ప్రమోషనల్ చేయించాలనుకుంటున్నాయి పలు ఇంటర్నేషనల్ సంస్థలు. ఇప్పటికే స్టార్ హీరోయిన్స్ ప్రియాంక చోప్రా, దీపికా పదుకొనే,కత్రినా కైఫ్ లాంటి స్టార్ట్స్ తో పాటు రీసెంట్ గా రష్మిక మందన్న కూడా ఈ అవకాశాన్ని దక్కించుకున్నారు. ఇప్పుడు ఆ లిస్ట్ లోకి అలియా భట్ కూడా చేరిపోయింది. ప్రముఖ ఇంటర్నేషనల్ బ్రాండ్ అయిన గూచీ కి బ్రాండ్ అంబాసిడర్ గా అలియా భట్ సెలెక్ట్ అయింది. ప్రపంచవ్యాప్తంగా చాలా కాస్ట్లీ బ్రాండ్ గా గుర్తింపు తెచ్చుకుంది గూచీ. దాదాపు డెవలప్ అయిన పలు దేశాలలో దుస్తులు, షూస్ , వాచెస్, బ్యాగ్స్, పలు ఆర్నమెంట్స్ ఇలా అనేక రకాల ఉత్పత్తులకి ఈ బ్రాండ్ నుంచి బిజినెస్ జరుగుతుంది. ఇక మనదేశంలో కూడా చాలామంది స్టార్స్ ఈ బ్రాండ్ కు సంబంధించిన వస్తువులనే ఉపయోగిస్తున్నారు. దాంతో మన దగ్గర నుంచి కూడా బ్రాండ్ కు ప్రమోషన్ చేయడానికి ఎప్పటినుంచో సెలబ్రిటీలను సెలెక్ట్ చేసుకునే పనిలో పడింది కంపెనీ. ఈ బ్రాండ్ ప్రమోట్ చేయడానికి అలియా భట్ ను బ్రాండ్ అంబాసిడర్ గా నియమించడం విశేషం.

Advertisement

తాజా వార్తలు

Advertisement