Wednesday, October 9, 2024

Alert – మ‌న‌కూ డీప్ ఫేక్ దెబ్బ‌త‌గ‌లొచ్చు..అప్ర‌మ‌త్తంగా ఉండండి…పార్టీ శ్రేణుల‌కు కెటిఆర్ పిలుపు

హైదరాబాద్‌: డీప్ ఫేక్ దెబ్బ‌కు ప్ర‌ధాని నుంచి సెల‌బ్రిటీల గిజ‌గిజ‌లాడిపోతున్నారు.. ఏదీ అసలో , న‌కీలో తెలియ‌క జ‌నం అయోమ‌యానికి గుర‌వుతున్నారు.. సెల‌బ్రీటీలు ఈ వీడియోలో ఉన్న‌ది మేము కాదు మోర్రో అంటూ వీధుల‌కెక్కి మొత్తుకుంటున్నారు.. తాజాగా క్రికెట్ దేవుడు స‌చిన్ కుమార్తె సారా కూడా డీప్ ఫేక్ బాధితురాలైంది.. ఆమె సైతం ఆ వీడియో, ఫోటోలు నావి కావంటూ ప‌బ్లిక్ గా స్టేట్మెంట్ ఇచ్చేసింది.. ఈ నేప‌థ్యంలోనే డీప్‌ఫేక్‌పై బీఆర్‌ఎస్‌ శ్రేణులు, సోషల్‌ మీడియా వారియర్స్‌ను మంత్రి కేటీఆర్ అప్రమత్తం చేశారు. పోలింగ్‌ సమీపిస్తుండటంతో డీప్‌ఫేక్‌లు చాలా రావొచ్చని హెచ్చరించారు. ఓటమి అంచున ఉన్న స్కాంగ్రెస్ డీప్‌ఫేక్‌తో దుష్ప్రచారం చేస్తుందని తెలిపారు. బీఆర్‌ఎస్‌ సైనికులు అప్రమత్తతో ఉండి ఓటర్లను చైతన్యపరచాలని ప్రముఖ సామాజిక మాధ్యమం ఎక్స్‌ వేదికగా సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement