Saturday, October 12, 2024

Anakapalli: బ‌స్సు, లారీ ఢీ… ఉద్యోగి మృతి, ఇద్ద‌రికి తీవ్ర‌గాయాలు

బస్సు, బొగ్గుల లారీ ఢీకొనడంతో ఓ ఉద్యోగి మృతిచెందగా, మరో ఇద్దరికి తీవ్రగాయాలైన ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనకాపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని పరవాడలో లారస్ పరిశ్రమకు చెందిన బస్సు, బొగ్గు లారీ ఢీకొన్నాయి.

ఈ ప్రమాదంలో అచ్యుతాపురం లారస్-6 పరిశ్రమకు చెందిన నాగ వెంకటేష్ అనే ఉద్యోగి మృతిచెందగా.. మరో ఇద్దరు ఉద్యోగులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ ఉద్యోగులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పరవాడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement