Saturday, May 4, 2024

అంతర్జాతీయ సర్వీసులకు ఆకాశ ఎయిర్‌కు అవకాశం

దేశీయంగా విమాన సేవలు అందిస్తున్న అకాశ ఎయిర్‌ తన సేవలను విస్తరించనుంది. అంతర్జాతీయ సర్వీస్‌ తన సేవల్లో 20వ విమానాన్ని చేర్చింది. ఎయిర్‌లైన్స్‌ నిబంధనల ప్రకారం ఏ విమానయాన సంస్థ అయినా కనీసం 20 విమానాల ద్వారా సర్వీస్‌లు అందిస్తుందే, ఆ సంస్థకు అంతర్జాతీయ సర్వీస్‌లు నడిపేందుకు అనుమతి అభిస్తుంది. ప్రస్తుతం దేశీయంగానే సేవలు అందిస్తున్న అకాశ ఎయిర్‌ ఇక నుంచి అంతర్జాతీయ సర్వీస్‌లను కూడా ప్రారంభించనుంది. ఇందు కోసం సంస్థ బోయింగ్‌ 737-8-200 విమానాన్ని తన ప్లీట్‌లో చేర్చింది. ఆసియాలోనే ఈ విమానం కలిగిన మొదటి ఎయిర్‌లైన్‌గా ఆకాశ ఎయిర్‌ నిలిచింది.

సంస్థ ప్రారంభించిన 12 నెలల్లోనే 20 విమానాలతో సేవలు అందించడం కేవలం ఆకాశ ఎయిర్‌ రికార్డు మాత్రమే కాదని, ఇది దేశ విమాన సామర్ధ్యాన్ని తెలియచేస్తుందని సంస్థ సీఈఓ వినయ్‌ దుబే అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది ఎన ్నడూ లేని విధంగా ఆకాశ ఎయిర్‌ మెరుగైన సేవలు అందించిందని చెప్పారు. 737-8 విమానాలు 23, హై కెపాసిటీ కలిగిన 737-8-200 విమానాలు 53తో కలిపి మొత్తం 72 విమానాల కోసం 2021లోనే ఆకాశ ఎయిర్‌ ఒప్పందం చేసుకుంది. ఈ సంవత్సరం జులైలో నాలుగు బోయింగ్‌ 737 మ్యాక్స్‌ విమానాలను కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం ఆకాశ ఎయిర్‌ వారానికి 900కు పైగా విమాన సర్వీస్‌లను నడుపుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement