Monday, May 20, 2024

హ‌ద్దులు దాటిన అభిమానం.. విమానంపై ఎన్టీఆర్ పేరు

మరోసారి తమ‌ అభిమాన నటుడు యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ పై ఉన్న ప్రేమను యూఎస్‌ అభిమానులు వినూత్న రీతిలో చూపించారు. విమానం వెనుక భాగంలో ‘ధన్యవాదాలు ఎన్టీఆర్‌.. తర్వాతి సినిమా కోసం వేచి ఉండలేకపోతున్నాం’ అని రాసి ఉన్న బ్యానర్‌ను ప్రదర్శించి ఆకాశమంత అభిమానాన్ని చాటుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను ‘ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ యూఎస్‌ఏ’ అనే ట్విట్టర్‌ ఖాతాలో షేర్‌ చేశారు. ప్రపంచ సినిమాకు గుండెకాయ లాంటి హాలీవుడ్‌పై.. ఎయిర్ ప్లేన్ బ్యానర్. ఆర్ఆర్ఆర్ సినిమాతో గుర్తుండిపోయే రైడ్‌కి ధన్యవాదాలు. ‘ఎన్టీఆర్ 30’ తో మ్యాన్ ఆఫ్ మాస్ మానియా కోసం వేచి చూడలేకపోతున్నాం. ఎన్టీఆర్‌కు, శివ కొరటాల, మొత్తం టీంకు మా శుభాకాంక్షలు. ఏప్రిల్‌ 5న ఎరుపు రంగు అద్దుదాం’ అంటూ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీన్ని చూసి ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement