Saturday, April 20, 2024

అఘోరా పాత్రలో విశ్కక్ సేన్.. సమ్మర్ రిలీజ్ కు సిద్దంగా “గామి”

విశ్వక్ సేన్ స్వయం దర్శకత్వంలో తెరకెక్కిన రెండవ సినిమా ధమ్కీ. ఈ మూవీ ఈ వారం 22న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ యాక్షన్ కామెడీ ఎంటర్‌టైనర్‌లో నివేదా పేతురాజ్ కథానాయికగా కనిపించనుంది.
ఇక, తాజా వార్తల ప్రకారం తిరుపతిలోని వెంకటేశ్వర ఆలయాన్ని సందర్శింకున్న విశ్వక్ సేన్.. చాలా రోజుల నుంచి వేయిటింగ్ లిస్ట్ లో ఉన్న మూవీ గామి కి సంభందించి కొన్ని విశయాలు వెల్లడించాడు. ధమ్కీ రిలీజ్ అయిన రెండు నెలల తర్వాత ఈ సినిమా విడుదలవుతుందని తెలిపారు.

దీని ప్రకారం, ఈ ఏడాది వేసవిలో గామి సినమా థియేటర్లలో చూడగలమని అర్థం అవుతుంది. విద్యాధర్ కగిత దర్శకత్వం వహించిన ఈ అడ్వెంచరస్ ఫాంటసీ మూవీలో విశ్వక్ సేన్ అఘోరాగా కనిపించనున్నాడు. చాందిని చౌదరి, ఎమ్.జి అభినయ, మహ్మద్ సమద్, దయానంద్ రెడ్డి, హారిక పెడాడ ఈ మూవీలో ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.

- Advertisement -

మరోవైపు, విశ్వక్ సేన్ 20వ మూవీ నిన్న హైదరాబాద్‌లో ప్రారంభమైంది. రవితేజ ముళ్లపూడి డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించనుంది. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా కనిపించనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement