Wednesday, May 15, 2024

200 విమానాలు కొనుగోలు చేయనున్న ఎయిర్‌ ఇండియా.. ఎయిర్‌ బస్‌, బోయింగ్‌లో చర్చలు

ఎయిర్‌లైన్స్‌ చరిత్రలోనే అత్యంత భారీ కొనుగోలు డీల్‌ను ఎయిర్‌ ఇండియా కుదుర్చుకున్నట్లు వార్తలు వెలువడ్డాయి. టాటాల ఆధీనంలో ఉన్న ఎయిర్‌ ఇండియా తన కార్యకలాపాలను భారీ ఎత్తున విస్తరించాలని నిర్ణయించింది. ఇందు కోసం కొత్తగా 200 విమానాలను కొనుగోలు చేయాలని నిర్ణయించినట్లు పరిశ్రమ వర్గాల సమాచారం. ఇందులో70 శాతం వి మానాలు తక్కువ దూరం ప్రయాణీంచేందుకు వీలైనవే ఉన్నాయని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. వీటిలో ఎయిర్‌ బస్‌ కంపెనికి చెందిన ఏ320 రకం విమనాలా, బోయింగ్‌ తయారు చేస్తున్న 737 మ్యాక్స్‌ మోడల్‌ విమానాల అన్న విషయం స్పష్టం కాలేదు
సుదూర ప్రాంతాలకు సర్వీస్‌లు నడిపేందుకు వీలుగా ఎయిర్‌ బస్‌ ఏ 350 విమనాల కొనుగోలుకు ఎయిర్‌ ఇండియా ప్రయత్నాలు చేస్తుందన్న వార్తలు వెెలుబడ్డాయి. కొనుగోలు చేయనున్న వాటిలో ఎక్కవ విమానాలు వెడల్పు తక్కువగా ఉండేవే ఉన్నాయని సమాచారం. వీటని తక్కువ దూరం ఉన్న ప్రాంతాలకు నడపనున్నారు. ఎయిర్‌ ఇండియా కొనుగోలు డీల్‌ విలువ 40.5 బిలియన్‌ డాలర్లు ఉంటుంది. విమానాల కొనుగోలుపై చర్చలు జరుగుతున్నాయని ఆ వర్గాలు దృవీకరించాయి. విమానయాన రంగంలో ఇప్పటికే పోటీ తీవ్రంగా ఉంది.

కోవిడ్‌ తరువాత ఈ పరిశ్రమ ఆశజనంగా ఉంది. ఇండిగో అంతర్జాతీయ విమాన సర్వీస్‌లను ఇంటర్‌ గ్లోబల్‌ ఎయిర్‌లైన్‌ పేరుతో విమాన సర్వీస్‌లు నడుపుతోంది. ఇండిగో యూరప్‌ నుంచి విమనాలను కొనుగోలు చేస్తోంది. విస్టారా, గో ఎయిర్‌లైన్‌, ఎయిర్‌ ఏషియా వంటి సంస్థలు గతంలోనే భారీ ఎత్తున విమనాల కొనుగోలుకు ఆర్డర్లు ఇచ్చి ఉన్నాయి. ఇందులో ఎయిర్‌ ఏషియా టాటాలకు చెందిన సంస్థ. దీన్ని ఎయిర్‌ ఇండియాలో త్వరలో విలీనం చేయనున్నారు. ఎయిర్‌ ఇండియా కొనుగోలు చేయనున్న 3 వందల విమనాలను కంపెనీలు 2025 కల్లా అన్నింటినీ డెలివరీ చేయనున్నాయి. ప్రస్తుతం ఎయిర్‌ బస్‌ కంపెనీ నెలకు 50 చిన్న విమనాలను తయారు చేసే సామర్ధ్యం కలిగి ఉంది. దీన్ని త్వరలోనే 65కు పెంచనున్నారు. టాటా గ్రూప్‌ ఎయిర్‌ బస్‌ ఏ 350 విమానాలను కొనుగోలు చేయనుంది. ఒక సారి డీల్‌ ఫైనల్‌ అయ్యాక, ఆయా రూట్స్‌లో సర్వీస్‌ నడునున్న విషయాన్ని ప్రచారంలో పెట్టనుంది. మిడిల్‌ ఈస్ట్‌ మీదుగా సుదూర ప్రాంతాలకు విమాన సర్వీస్‌లను కూడా నడపాలని ఎయిర్‌ ఇండియా భావిస్తోంది. దూర ప్రాంతాల సర్వీస్‌ల విషయంలో , విదేశీ సంస్థల నుంచి పోటీ తీవ్రంగా ఉంటుంది. వీటిలో చాలా వరకు మన దేశం నుంచి అమెరికా, లండన్‌, ప్రాన్స్‌ వంటి అనేక ముఖ్యమైన ప్రాంతాలకు నాన్‌ స్టాప్‌ సర్వీస్‌లను నడుతపున్నాయి.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement