Sunday, April 28, 2024

Network | ఎయిర్‌టెల్‌ నుంచి ఎయిర్‌ ఫైబర్‌

ప్రముఖ టెలికం సంస్థ ఎయిర్‌టెల్‌ ఎక్స్‌ట్రీమ్‌ ఎయిర్‌ ఫైబర్‌ పేరుతో ఫిక్స్‌డ్‌ వైర్‌లెస్‌ సర్వీస్‌లు ప్రారంభించింది. ఈ సేవలను ముందుగా ఢిల్లి, ముంబై నగరాల్లో అందుబాటులోకి తీసుకు రానున్నట్లు ఎయిర్‌టెల్‌ తెలిపింది. ఫైబర్‌ నెట్‌వర్‌ ్క లేని నగరాలతో పాటు, గ్రామీణ ప్రాంతాల్లో బ్రాండ్‌బ్యాండ్‌ కనెక్షన్‌ అందించేందుకు ఈ ఎయిర్‌ ఫైబర్‌ సేవలు ఉపయోగపడతాయని ఎయిర్‌టెల్‌ తెలిపింది.
దేశంలో ఫైబర్‌ నెట్‌వర్క్‌ను విస్తరించేందుకు అడ్డంకులు ఉన్నాయని, ఈ లోటును ఎయిర్‌ ఫైబర్‌ తీరుస్తుందని తెలిపింది.

ప్రతి ఇంటికి వైఫై సర్వీస్‌లు అందించేందుకు వీలు కలుగుతందని పేర్కొంది. త్వరలోనే ఈ సేవలను దేశవ్యాప్తంగా ప్రారంభిస్తామని ఎయిర్‌ కన్జూమర్‌ బిజినెస్‌ డైరెక్టర్‌ సారస్వత్‌ శర్మ తెలిపారు. మేకిన్‌ ఇండియా ప్రోగ్రామ్‌ కింద ఎయిర్‌ ఫైబర్‌ డివైజ్‌లను తయారు చేస్తున్నట్లు తెలిపారు. ఎక్స్‌ట్రీమ్‌ ఎయిర్‌ ఫైబర్‌ అనేది ప్లగ్‌ అండ్‌ ప్లే డివైజ్‌. వైఫై 6 టెక్నాలజీతో పని చేస్తుంది. గరిష్టంగా దీనికి 64 డివైజ్‌లను కనెక్ట్‌ చేసుకోవచ్చు. ఎయిర్‌టెల్‌ స్టోర్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. ఎక్స్‌ట్రీమ్‌ ఎయిర్‌ ఫైబర్‌ యాప్‌ సహాయంతో దీన్ని వైఫై నెట్‌వర్క్‌కు కనెక్ట్‌ చేసుకోవచ్చు. ఎయిర్‌ ఫైబర్‌ నెలవారీ ప్లాన్‌ను 799 రూపాయలుగా ఎయిర్‌ టెల్‌ నిర్ణయించింది. ఇందులో 100 ఎంబీబీఎస్‌ వేగంతో ఇంటర్నెట్‌ సేవలు అందుతాయని తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement