Tuesday, October 8, 2024

Shock to NDA – కూట‌మి నుంచి అన్నాడిఎంకే అవుట్

చెన్నై: వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనున్న వేళ తమిళనాడులో కీలక రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. భాజపా సారథ్యంలోని ఎన్డీయే నుంచి అన్నాడీఎంకే పార్టీ వైదొలగింది. ఎన్డీయే, భాజపాతో సంబంధాలు తెంచుకుంటున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు చెన్నైలో జరిగిన అన్నాడీఎంకే పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ జిల్లా అధ్యక్షుల సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. భాజపాతో తెగదెంపులు చేసుకుంటున్నట్టు అన్నాడీఎంకే డిప్యూటీ జనరల్‌ సెక్రటరీ కేపీ మునుస్వామి ప్రకటించారు.

గత కొంత కాలంగా తమిళనాడులోని భాజపా, అన్నాడీఎంకే నేతల మధ్య పలు అంశాలపై తీవ్రస్థాయిలో విభేదాలు పొడచూపుతున్న విషయం తెలిసిందే. అన్నా డిఎంకెను ప‌క్క‌న‌పెట్టి బిజెపి స్వ‌తంత్రంగా త‌మిళ‌నాడులో బ‌ల‌ప‌డేందుకు కృషి చేస్తున్న‌ది.. ఈ నేప‌థ్యంలోనే అన్నా డిఎంకే ఎన్డీఏ కూట‌మి నుంచి వైతొలిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement