Tuesday, May 14, 2024

అహింస రిలీజ్ డేట్ ఫిక్స్.. పోస్టర్ తో క్లారిటీ

ద‌గ్గుబాటి అభిరామ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న చిత్రం అహింస‌.ఈ మూవీని డైరెక్ట‌ర్ తేజ తెర‌కెక్కిస్తున్నాడు. ఏప్రిల్ 7న ప్ర‌పంచ‌వ్యాప్తంగా థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌నుంద‌ని అప్ డేట్ ఇచ్చారు మేక‌ర్స్. ఈ సినిమాలోని పాత్రలతో డిజైన్‌ చేసిన కొత్త పోస్టర్‌తో ఇదే విషయాన్ని తెలియజేస్తూ.. ట్వీట్‌ చేశారు మేకర్స్‌. 20 ఏండ్ల క్రితం తేజ డైరెక్షన్‌లో లవ్‌ స్టోరీ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కిన జయం సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన సదా.. ఈ చిత్రంలో లాయర్‌గా కనిపించనుండటం విశేషం.అహింసలో యాక్టర్‌ కమ్‌ డైరెక్టర్‌ సముద్రఖని విల‌న్‌గా న‌టిస్తున్నాడు. రజత్‌ బేడి, రవి కాలే, కమల్ కామరాజు, మనోజ్‌ టైగర్‌, కల్పలత, దేవీ ప్రసాద్‌ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఆనంది ఆర్ట్స్ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై పీ కిర‌ణ్ తెర‌కెక్కిస్తున్నారు. ప్రేమ‌క‌థ నేప‌థ్యంలో వస్తోన్న ఈ మూవీలో గీతికా హీరోయిన్‌గా న‌టిస్తోంది.హీరోహీరోయిన్ల లవ్‌ ట్రాక్‌తోపాటు ఫ్యామిలీ, ఎమోష‌న్స్, యాక్షన్‌ సీక్వెన్స్ చుట్టూ తిరుగుతూ సినిమా ఉండబోతున్నట్టు ఇప్పటికే విడుదలైన టీజర్‌, ట్రైలర్‌ తో క్లారిటీ ఇచ్చేశాడు తేజ.

Advertisement

తాజా వార్తలు

Advertisement