Wednesday, May 1, 2024

రెండేళ్ల విరామం తర్వాత.. ఆర్జిత సేవా టికెట్ల బుకింగ్‌ ప్రారంభం..

తిరుమల, ప్రభన్యూస్‌: తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను ఆఫ్‌లైన్‌లో లక్కీడిప్‌ ద్వారా భక్తులకు కేటాయించే విధానం రెండేళ్ల విరామం తర్వాత మార్చి 31న పున: ప్రారంభం కానుంది. ఇందుకోసం సీఆర్‌వో జనరల్‌ కౌంటర్లలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. కరోనా వ్యాప్తి కారణంగా 2020 మార్చి 20న శ్రీవారి ఆలయంలో భక్తులకు దర్శనం నిలుపుదల చేయడంతోపాటు ఆర్జిత సేవల కేటాయింపును నిలిపివేసిన విషయం తెలిసిందే. దాదాపు రెండేళ్ల తర్వాత ఈ విధానాన్ని టీటీడి తిరిగి ప్రారంభించింది.
టికెట్ల కేటాయింపు ఇలా జరుగుతుంది.. నిర్దేశించిన వివిధ అర్జిత సేవా టికెట్లకోసం యాత్రికులు తిరుమలలోని కరంట్‌ బుకింగ్‌ కౌంటర్‌లో ఉదయం 11 నుంచి సాయంత్రం 5గంటల మధ్య నమోదు చేసుకోవాల్సి ఉంది. రెండు అక్నాలెడ్జ్‌మెంటు స్లిప్‌లు వస్తాయి. ఒక స్లిప్‌ యాత్రికునికి అందిస్తారు. ఇందులో వారి నమోదు సంఖ్య, సేవ తేదీ, వ్యక్తి పేరు, మొబైల్‌ నంబర్‌ మొదలైనవి ఉంటాయి. మరొక స్లిప్‌ రెఫరెన్స్‌ కోసం కౌంటర్‌ సిబ్బంది ఉంచుకుంటారు. నమోదు చేసుకున్న గృహస్తుల సమక్షంలో సాయంత్రం 6 గంటలకు ఆటోమేటెడ్‌ రాండమైజ్డ్‌ నంబరింగ్‌ సిస్టం ద్వారా ఎల్‌ఈడీ స్క్రీన్లలో మొదటి డిప్‌ తీస్తారు. సాధారణంగా శుక్రవారం అడ్వాన్స్‌డ్‌ బుకింగ్‌ టికెట్లు కలిగిఉన్న గృహస్తులు గురువారం రాత్రి 8 గంటలలోపు అర్జితం కార్యాలయంలో రిపోర్ట్‌ చేయాలి. ఇలా ఎవరైనా చేయని పక్షంలో ఆ టికెట్లను రాత్రి 8.30 గంటలకు రెండ వసారి నిర్వహించే లక్కిడిప్‌ కోసం కరెంట్‌ బుకింగ్‌కు మళ్లిస్తారు.

లక్కిడిప్‌లో టికెట్లు పొందిన గృహస్థులు వాటిని వాటిని కొనుగోలు చేసేందుకు రాత్రి 11 గంటలలోపు వారి రిజిస్టర్డ్‌ మొబైల్‌ నంబర్లకు ఎస్‌ఎంఎస్‌ ద్వారా సమాచారం తెలియజేస్తారు. టికెట్లు పొందని వారికి కూడా ఎస్‌ఎంఎస్‌ ద్వారా తెలియజేస్తారు. యాత్రికులు డిప్‌ విధానంలో అవకాశానిన పొందడం కోసం ఆటో ఎలిమినేషన్‌ ప్రక్రియ అమలవుతుంది. యాత్రికులు డిప్‌ విధానంలో ఏదైనా ఆర్జిత సేవ పొంది ఉన్నట్లయితే ఆరు నెలల వరకు తిరిగి వారు ఆర్జిత సేవలను పొందేందుకు అనుమతించబడరు. యాత్రికులు ఒక ఆర్జిత సేవకు మాత్రమే నమోదు చేసుకోవడానికి అనుమతి ఉంటుంది. సేవల నమోదు కోసం ఆధార్‌ తప్పనిసరి. ఎన్‌ఆర్‌ఐలు అయితే పాస్‌పోర్టు చూపాల్సి ఉంటుంది. యాత్రికులు ఒరిజినల్‌ ఫోటో గుర్తింపు కార్డుతో స్వయంగా హాజరు కావాలి. కొత్తగా పెళ్లయిన జంటలకు ని ర్ణీత కోటా ప్రకారం వివాహకార్డు, లగ్నపత్రిక, ఒరిజినల్‌ ఫోటో గుర్తింపు కార్డు సమర్పిస్తే కళ్యానక్షత్సవం టికెట్ల కేటాయింపు జరుగుతుంది. వివాహం జరిగి 7 రోజులు మించకుండా ఉండాలి. ముందుగా వచ్చిన వారికి మందు అనే ప్రాతిపదికన టికెట్లు కేటాయిస్తారు. భక్తులు పై మార్గదర్శకాలను గమనించాలన్నారు.

మార్చి 31న అంగ ప్రదక్షిణం టోకన్లు జారీ.

అంగప్రదక్షణం టోకెన్లను కూడా టీటీడీ పునరుద్దరించింది. కోవిడ్‌కు ముందున్న తరహా ఏర్పాట్లతో మార్చి 31వ తేదినుంచి ఈ టోకెన్లు జారీ చేస్తారు. తిరుమలలోని పీఏసీ-1 లో రెండు కౌంటర్లలో ప్రతిరోజూ 750 టోకెన్లు జారీ చేస్తారు. సాధారణంగా శుక్రవారాల్లో అభిషేకం కారణంగా భక్తులకు దర్శనం లేకుండా అంగప్రదక్షిణకు మాత్రమే అనుమతిస్తారు. ఈ కారణంగా ఏప్రిల్‌ 1న శుక్రవారం అభిషేకం కారణంగా అంగప్రదక్షిణ భక్తులకు దర్శనం ఉండదని టీటీడీ అధికారులు తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement