Sunday, April 28, 2024

వీడియో: కాబూల్ ఎయిర్‌పోర్టులో ఇది పరిస్థితి..

తాలిబన్లు ఆప్ఘానిస్తాన్ ను ఆక్రమించుకుండటంతో ఆ దేశంలోని సామాన్య ప్రజలు దిక్కుతోచని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఏ నిమిషంలో ఏమి జ‌రుగుతుందో తెలియ‌క అక్కడి ప్రజలు భ‌య‌ప‌డుతున్నారు. విదేశాలకే పారిపోవడానికి విమానశ్రయానికి చేరుకుంటున్నారు ప్రజలు. దీంతో విమానాశ్రయం జనంతో కిక్కిరిసిపోయింది. రాత్రంతా విమానాల కోసం పడిగాపులు కాచారు. అక్కడ ఏ విమానం కనిపించినా అందులో ఎక్కి ప్రాణాలతో బయటపడేందుకు ప్రయత్నిస్తున్నారు. టిక్కెట్ ఎంతైనా ఇచ్చేందుకు సిద్ధం..తమకు విమానంలో టిక్కెట్ ఇవ్వాలని వేడుకుంటున్నారు.  దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నారు. వందలాది మంది విమానం ఎక్కేందుకు ప్రయత్నిస్తున్న దృశ్యాలు హృదయ విదారకంగా ఉన్నాయి. మరో వైపు కాబూల్ జైళ్ల నుంచి ఖైదీలు విడుదలయ్యారు.

 పెద్ద ఎత్తున స్థానిక ప్ర‌జ‌లు ఏయిర్‌పోర్టుకు చేరుకోవ‌డంతో ఒక‌ద‌శ‌లో వారిని కంట్రోల్ చేయ‌డం క‌ష్టంగా మారింది.  అందుబాటులో ఉన్న విమానాల‌ను ఎక్కేస్తుండంతో అమెరిక‌న్ సైన్యం అప్ర‌మ‌త్త‌రం అయింది. వీరిని కంట్రోల్ చేయడానికి సైన్యం కాల్పులు జ‌రిపిన‌ట్టుగా వార్త‌లు వ‌స్తున్నాయి. దీంతో తొక్కిసలాటలో ముగ్గురు మృతి చెందారు. అస‌లే ప్రాణ‌భ‌యంతో బిక్కుబిక్కుమంటూ ఎలాగైనా దేశం విడిచి వెళ్లాల‌ని చూస్తున్న ప్ర‌జ‌ల‌కు ఎయిర్‌పోర్ట్‌లో ఎదురైన సంఘ‌ట‌న‌ల‌తో మరింత భ‌యాందోళ‌న‌లు చెందుతున్నారు. ఇక ఇదిలా ఉంటే, కాబూల్ ఎయిర్‌పోర్ట్‌లో క‌ల‌క‌లం రేగ‌డంతో ఎయిర్‌పోర్ట్‌ను మూసేస్తున్న‌ట్టు అధికారులు ప్ర‌క‌టించారు.  త‌దుప‌రి ఉత్త‌ర్వులు వ‌చ్చేవ‌ర‌కు సివిల్ ఏవియేష‌న్‌కు అనుమ‌తులు ఇవ్వ‌డం లేద‌ని ప్ర‌క‌టించారు.  వెంట‌నే ఈ ఉత్త‌ర్వులు అమ‌లులోకి రావ‌డంతో ప‌లు దేశాలు త‌మ విమానాల‌ను దారి మ‌ళ్లించాయి.  ఢిల్లీ-చికాగో విమానంను దారిమ‌ళ్లించారు.

ఇక మరో వైపు ఆప్ఘాన్ నుంచి తమ దేశ రాయబార కార్యాలయాలను మూసివేస్తున్నాయి ఇతర దేశాలు. దీంతో త‌మ ఉద్యోగులు, సిబ్బందిని స్వ‌దేశానికి త‌ర‌లించేందుకు పెద్ద ఎత్తున విమానాల‌ను సిద్దం చేశారు.  ఆర్మీ హెలికాప్ట‌ర్లు, విమానాలు అన్నింటిని స్వదేశానికి త‌ర‌లించేందుకు కాబూల్ ఎయిర్‌పోర్టులో ఉన్నాయి.  అయితే, అమెరికా, బ్రిట‌న్ వంటి దేశాలు తొలుత వారి దేశానికి చెందిన వారికి ప్రాధాన్య‌త ఇస్తున్నాయి.  బ్రిట‌న్ త‌మ వారిని త‌ర‌లించిన త‌రువాతే మిగ‌తావారిని త‌ర‌లిస్తామ‌ని చెబుతుండ‌టంతో ఆఫ్ఘ‌న్‌లు ఆందోళ‌న చెందుతున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ గందరగోళ వాతావరణం నెలకొంది.

ఇది కూడా చదవండి: దొరగారి పాలనలో మహిళకు రక్షణ కరువు

Advertisement

తాజా వార్తలు

Advertisement