Sunday, May 19, 2024

అంధుల ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలల్లో ప్రవేశాలు.. ప్రారంభ‌మైన అడ్మిష‌న్లు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రాష్ట్రంలోని అంధులు, బధిరుల ఆశ్రమ పాఠశాలల్లో 2022-23 విద్యా సంవత్సరానికి గాను ప్రవేశానికి అడ్మిషన్ల ప్రక్రియను ప్రారంభించినట్లు దివ్యాంగులు, వయో వృద్ధుల సంక్షేమ శాఖ సంచాలకులు బి, శైలజా తెలిపారు. తమ శాఖ ఆధ్వర్యంలో రెండు ఆంధులు, మూడు బధిరుల ఆశ్రమ పాఠశాలలు, ఒక జూనియర్‌ కాలేజీలలో సీట్లు ఖాళీగా ఉన్నట్లు ఆమె వెల్లడించారు. విద్యార్థుల వయస్సు ఆరు సంవత్సరాలు పైబడి ఉండాలని, 40 నుంచి 100 శాతం అంధత్వం, బధిరత్వం ఉన్న బాలబాలికలు అర్హులని ఆమె పేర్కొన్నారు. ఈ పాఠశాల్లో ఒకటి నుంచి పదవ తరగతి వరకు ఉచిత విద్యతో పాటు కంప్యూటర్‌ విద్యా నేర్పిస్తారన్నారు.

అంధ విద్యార్థులకు బ్రెయిలీ లిపిలోనూ, బధిర విద్యార్థులకు సంజ్ఞల బాషలో విద్యను నేర్పిస్తారని ఆమె తెలిపారు. అడ్మిషన్ల కోసం కరీంనగర్‌ ప్రభుత్వ అంధుల పాఠశాల (84843317315) నెంబర్‌లో సంప్రదించాలని ఆమె కోరారు. అలాగే మహబూబ్‌నగర్‌ ప్రభుత్వ అంధుల ఆశ్రమ పాఠశాల, జూనియర్‌ కాలేజీలో ప్రవేశాల కోసం 9518243784 నెంబర్‌, హైదరాబాద్‌ ప్రభుత్వ బధిర పాఠశాల్లో ప్రవేశానికి 7674933347 నెంబర్‌, మిర్యాలగూడ ప్రభుత్వ బధిర ఆశ్రమ పాఠశాల్లో ప్రవేశానికి 9000013632 నెంబర్‌, కరీంనగర్‌ ప్రభుత్వ బధిర ఆశ్రమ పాఠశాల్లో ప్రవేశానికి 9000013639 నెంబర్లలో సంప్రదించాలని సంచాలకురాలు శైలజా సూచించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement