Tuesday, April 30, 2024

Business: మార్కెట్‌ విలువలో టాటాలను మించిన అదానీ.. దేశంలో నెంబర్‌ 1 గ్రూప్‌గా అవతరణ

ప్రముఖ ప్రారిశ్రామికవేత్త గౌతమ్‌ అదానీ అధ్వర్యంలోని అదానీ గ్రూప్‌ కంపెనీల నికర విలువ టాటా గ్రూప్‌ కంపెనీలను మించిపోయింది. సంపదలో అదానీ దేశంలో అగ్రస్థానానికి చేరుకున్నారు. శుక్రవారం నాడు మార్కెట్లు మిగిసిన తరువాత అదానీ కంపెనీల మార్కెట్‌ విలువ 22.27 లక్షల కోట్లకు చేరింది. టాటా గ్రూప్‌ కంపెనీలు, సంస్థల మార్కెట్‌ విలువ 20.77 లక్షల కోట్లుగా ఉంది. టాటా గ్రూప్‌ ఇప్పుడు రెండో స్థానానికి పడిపోయింది. సంపదలో మూడో స్థానంలో ఉన్న ముఖేష్‌ అంబానీ ఆధర్యంలోని రిలయన్స్‌ గ్రూప్‌ కంపెనీల మార్కెట్‌ విలువ 17.16 లక్షల కోట్లుగా ఉంది.

అదానీ గ్రూప్‌లో 9 కంపెనీలు స్టాక్‌ మార్కెట్‌లో లిస్ట్‌యి ఉన్నాయి. శుక్రవారం నాటికి అదానీ గ్రూప్‌లో అంబుజా, ఏసీసీ సిమెంట్‌ చేరాయి. ప్రస్తుతం అంబుజా సిమెంట్స్‌కు గౌతమ్‌ అదానీ ఛైర్మన్‌గా వ్యవహరిస్తారని కంపెనీ తెలిపింది. ఏసీసీ సిమెంట్స్‌కు అదానీ పెద్ద కుమారుడు కరణ్‌ అదానీ సారధ్యం వహించనున్నారు. టాటా గ్రూప్‌లో స్టాక్‌మార్కెట్‌లో 27 కంపెనీలు ఉన్నాయి. ఇందులో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ నికర సంపద మొత్తం గ్రూప్‌ సంపదలో 53 శాతం కలిగి ఉంది.

ముఖేష్‌ అంబానీ అధ్వర్యంలోని రిలయన్స్‌ గ్రూప్‌లో 9 కంపెనీలు స్టాక్‌మార్కెట్‌లో ఉన్నాయి. ఇందులో ఒక్క రిలయన్స్‌ ఇంస్ట్రీస్‌ ఒక్కటే మొత్తం గ్రూప్‌ సంపదలో 98.5 శాతం కలిగి ఉంది. గ్రూప్‌లో విడిగా కంపెనీలు విలువ ప్రకారం రిలయన్స్‌ ఆయిల్‌, టెలికాం కంపెనీ రిలయన్స్‌ జియో రెండు కూడా దేశంలో అత్యంత విలువైన కంపెనీలుగా ఉన్నాయి. వీటి మార్కెట్‌ సంపద 16.91 లక్షల కోట్లుగా ఉంది. దీని తరువాత టీసీఎస్‌ మార్కెట్‌ విలువ 11 లక్షల కోట్లుగా ఉంది. అదానీ గ్రూప్‌లో కంపెనీల మధ్య సంపద విభజింపబడి ఉంది. అదానీ గ్రూప్‌లో ప్రస్తుతం అదానీ ట్రాన్స్‌మిషన్‌ కంపెనీ ఎక్కువ విలువైన కంపెనీగా ఉంది. దీని నికర సంపద 4.57 లక్షల కోట్లుగా ఉంది.

- Advertisement -

సంపద విషయంలో ముఖేష్‌ అంబానీకి, అదానీకి మధ్య 40 శాతం వ్యత్యాసం ఉంది. ముఖేష్‌ అంబానీ 91 బిలియన్‌ డాలర్లతో ప్రపంచ కుబేరుల్లో 8వ స్థానంలో ఉన్నారు. ఈ సంవత్సరం అదానీకి చెందిన 4 కంపెనీల షేర్ల విలువ రెట్టింపైంది. అదానీ పవర్‌ షేరు విలువ 3.9 రెట్లు పెరిగింది. అదానీ ట్రాన్స్‌మిషన్‌ షేరు విలువ 2.4 రెట్టు పెరిగింది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ 5.5 శాతం పెరిగితే, టీసీఎస్‌ మాత్రం 20 శాతం నష్టపోయింది. అదానీ గ్రూప్‌లో టోటల్‌ గ్యాస్‌, అదానీ గ్రీన్‌ ట్రేడ్‌ కంపెనీల షేరు విలువ 700 రెట్లు పెరిగాయి. 2022 ఆర్థిక సంవత్సరంలో అదానీ కంపెనీల నికర ఆదాయం 2.02 లక్షల కోట్లుగా ఉంది. నికర లాభం 13,423 కోట్లు గా ఉంది.

ప్రస్తుతం అదానీ గ్రూప్‌లో భాగమైన అంబుజా, ఏసీసీ సిమెంట్స్‌ నికర ఆదాయం 29,900 కోట్లు, నికర లాభం 2,780 కోట్లుగా ఉంది. టాటా కంపెనీల నికర ఆదాయం 8.6 లక్షల కోట్లుగా ఉంది. నికర లాభం 74,523 కోట్లు వచ్చింది. 2022 ఆర్థిక సంవత్సరంలో రిలయన్స్‌ నికర ఆదాయం 7.4 లక్షల కోట్లుగా ఉంది. నికర లాభం 60,705 కోట్లుగా ఉంది.
అదానీ గ్రూప్‌ వ్యాపారాన్ని అత్యంత వేగంగా విస్తరించారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా పందను పంచుకున్న కంపెనీ కేవలం అదానీ గ్రూప్‌ మాత్రమే. అదానీ వ్యాపార విస్తరణ మొత్తం ఉన్న కంపెనీలను కొనడ ంతోనే సాగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement