Friday, May 3, 2024

16ఏళ్ల వ‌య‌సులో యాడ్ షూట్.. ఆ చెవి రింగులు ఇంకా ఉన్నాయ్.. జీన‌త్ అమ‌న్

న‌టి కాక‌ముందు మోడ‌ల్ గా త‌న హ‌వా చాటింది బాలీవుడ్ సీనియ‌ర్ న‌టి జీన‌త్ అమ‌న్. ఇటీవ‌లే ఆమె కొత్త‌గా ఇన్‌స్టాగ్రామ్(Instagram) అకౌంట్ ఓపెన్ చేశారు. దాంట్లో జీన‌త్ అమ‌న్ పెట్టిన పోస్టు ఇప్పుడు అంద‌రీ ఆక‌ట్టుకుంటోంది. 16 ఏళ్ల వ‌య‌సులో.. తాజ్‌మ‌హ‌ల్ వ‌ద్ద జీన‌త్ ఫోటో షూట్‌లో పాల్గొంది. బ్రూక్‌బాండ్ తాజ్‌మ‌హ‌ల్ కోసం ఆ రోజుల్లో జీన‌త్ షూట్ చేసింది. ఆ టీ బ్రాండ్ ఫోటోను ఇన్‌స్టాలో పోస్టు చేసిన జీన‌త్ .. అప్పుడు ధ‌రించిన చెవి రింగులు ఇంకా త‌న వ‌ద్దే ఉన్న‌ట్లు కూడా ఆ పోస్టులో చెప్పింది. ప్ర‌స్తుతం జీన‌త్ అమ‌న్ వ‌య‌సు 71 ఏళ్లు. స్కూల్‌కు వెళ్లే రోజుల్లో మోడ‌ల్ అని, టీ యాడ్‌లో ధ‌రించిన చెవి రింగులు ఇంకా త‌న వ‌ద్దే ఉన్నాయ‌ని తెలిపారామె.

Advertisement

తాజా వార్తలు

Advertisement