Tuesday, April 30, 2024

చురుకుగా కదులుతున్న నైరుతి రుతుపవనాలు.. మరో రెండు రోజులు విస్తారంగా వర్షాలు

అమరావతి, ఆంధ్రప్రభ: బంగాళాఖాతం నుంచి కోస్తాపైకి తేమగాలులు వీస్తుండటంతో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. దీంతో శుక్రవారం కోస్తాలో అనేకచోట్ల ఒక మోస్తరు నుంచి భారీవర్షాలు కురిశాయి. రానున్న 24 గంటల్లో కోస్తాలో ఎక్కు వచోట్ల, రాయలసీమలో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కోస్తాలో అక్కడక్కడా భారీవర్షా లు పడతాయని, ఆ తరువాత రెండు, మూడు రోజులు కూడా అక్కడక్కడా భారీవర్షాలు కురుస్తాయని పేర్కొంది. కోస్తా, రాయలసీమలో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే నాలుగు నుంచి ఏడు డిగ్రీలు తక్కువగా నమోదయ్యాయి.

రుతుపవన ద్రోణి ఇప్పుడు గంగానగర్‌, రోహ్తక్‌, గ్వాలియర్‌, సిధి, అంబికాపూర్‌, సంబల్పూర్‌, బాలాసోర్‌ మరియు ఆగ్నేయ దిశగా తూర్పు మధ్య బంగాళా ఖాతం వరకు ప్రయాణిస్తున్నది. ఇది సగటు సముద్ర మట్టము ఫై 0.9 కి.మీ వరకు విస్తరించి ఉంది. ఇది సగటు సముద్ర మట్టం ఫై 5.8 కి.మీ ఎత్తు వరకు విస్తరించి , ఎత్తు కు వెళ్లే కొద్దీ నైరుతి దిశగా వంగి ఉన్నది. దీని ఫలితంగా మరో రెండు రోజుల పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవ కాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement