Monday, April 29, 2024

తాత‌లు..తండ్రులు ఉంటే స‌రిపోదు-టాలెంట్ ఉండాలి..బండ్ల గ‌ణేష్ ట్వీట్

తాత‌లు..తండ్రులు ఉంటే స‌రిపోదు..టాలెంట్ కూడా ఉండాల‌ని న‌టుడు..నిర్మాత బండ్ల గ‌ణేష్ చేసిన ట్వీట్ వైర‌ల్ గా మారింది. ఎన్టీఆర్‌లా, మ‌హేష్ బాబులా, రామ్‌చ‌ర‌ణ్‌లా, ప్ర‌భాస్‌లా గుర్తుపెట్టుకో బ్ర‌ద‌ర్ అంటూ ట్వీట్ చేశాడు. అయితే ఈ ట్వీట్‌ను హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌ని ఉద్దేశించి ప‌రోక్షంగా వార్నింగ్ ఇచ్చాడంటూ నెటీజ‌న్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ ట్వీట్ వైర‌ల్‌గా మారింది. కాగా విజ‌య్ దేవ‌ర‌కొండ ‘లైగ‌ర్’ ట్రైల‌ర్ లాంచ్ ఈవెంట్‌లో ‘మీకు మా తాత తెల్వ‌దు.. మా అయ్య తెల్వ‌డు.. ఎవ్వ‌డు తెల్వ‌దు. రెండేళ్ళు అయితుంది సినిమా రిలీజై. ఆ ముందు రిలీజైన సినిమా కూడా పెద్ద చెప్పుకునేది కూడా కాదు. అయినా ట్రైల‌ర్‌కు ర‌చ్చేంద్రా నాయినా’ అంటూ విజ‌య్ చేసిన వ్యాఖ్య‌లు వైర‌ల్ అయిన విష‌యం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement