Monday, April 29, 2024

అస‌త్య ప్ర‌చారాలు చేయొద్దు-ఇది మా జీవితాల‌కి సంబంధించిన విష‌యం- న‌టి మీనా

రీసెంట్ గా న‌టి మీనా భ‌ర్త విద్యా సాగ‌ర్‌ మ‌ర‌ణించిన సంగ‌తి తెలిసిందే..అయితే ఆయ‌న మ‌ర‌ణంపై సోష‌ల్ మీడియాలో జ‌రుగుతున్న అసత్య ప్ర‌చారంపై న‌టి మీనా ఆవేదన వ్యక్తం చేశారు. అసలే తన భర్త మరణించారన్న బాధలో తాను, తన కుటుంబం కోలుకోలేని స్థితిలో ఉంటే..అవన్నీ పట్టించుకోకుండా.. త‌న భ‌ర్త మ‌ర‌ణంపై అస‌త్య వార్త‌ల‌ను ప్ర‌సారం చేస్తున్నారంటూ ఆమె ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఇక‌నైనా ఇలాంటి అసత్య వార్తలు ప్రచారం చేయకుండా ఆపాలంటూ ఆమె అందరిని వేడుకున్నారు. ఎవరికి తోచింది వారు రాయడానికి ఇది ఏదో ఓక వార్త కాదని..

ఇది తమ భావోద్వేగాలకు, తమ జీవితాలకు సంబంధించిన విషయం అని ఆమె అవేదనతో వేడుకున్నారు. మీనా విద్యాసాగర్ శ్వాస సంబంధిత వ్యాధి వల్ల చనిపోయారు. అయితే ఈ విషయంపై రకరకాల వార్తలు సోషల్ మీడియాతో పాటు మీడియాలో కూడా ప్రసారం అయ్యాయి. తన ప‌రిస్థితిని అర్థం చేసుకోవాలని.. తనకు త‌న కుటుంబ ప్రైవ‌సీకి భంగం క‌లిగించ‌వద్దని మీడియాను కోరారు మీనా . ఇలాంటి క‌ష్ట స‌మ‌యంలో త‌న‌కు అండ‌గా నిలిచిన వారికి ఆమె ధ‌న్య‌వాదాలు తెలిపారు. అంతే కాదు త‌న భ‌ర్త ప్రాణాల‌ను కాపాడేందుకు త‌మిళ‌నాడు ప్రభుత్వం, సీఎం, ఆరోగ్య శాఖ మంత్రి, అధికారులు ఇలా ప్రతీ ఒక్కరు తమ శాయ‌శ‌క్తులా కృషి చేశార‌న్నారు. తన గురించి తాపత్రేయపడిన ప్రతీ ఒక్కరికి ఆమె ధ‌న్య‌వాదాలు తెలిపారు. ఈ మేర‌కు ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ ని పోస్ట్ చేశారు మీనా.

Advertisement

తాజా వార్తలు

Advertisement