Wednesday, May 1, 2024

టెక్నికల్‌ టీచర్స్‌ కోర్సుకు దరఖాస్తులు స్వీకరణ..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: టెక్నికల్‌ టీచర్స్‌ సర్టిఫికెట్‌ 42 రోజుల సమ్మర్‌ ట్రైనింగ్‌ కోర్సుకు (టీసీసీ) దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్‌ కృష్ణారావు తెలిపారు. హైదరాబాద్‌, హన్మకొండ, నిజామాబాద్‌, నల్గొండ, కరీంనగర్‌ జిల్లాల్లో కోర్సుకు సంబంధించిన శిక్షణను ఇవ్వనున్నట్లు తెలిపారు.

ఆయా జిల్లా డీఈఓలను సంప్రదించి దరఖాస్తు ప్రక్రియ గురించి వివరాలు తెలుసుకొవచ్చారు. సూచించారు. మే 1 నుంచి జూన్‌ 11 వరకు కోర్సు శిక్షణ ఉంటుందని తెలిపారు. ఈనెల 21 నుంచి 30 వరకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్ల పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement