Thursday, April 25, 2024

Delhi : ప్ర‌ధాని ఇంటిముట్టడికి ఆప్ పిలుపు… అప్ర‌మ‌త్త‌మైన పోలీసులు…

మ‌ద్యం పాలసీ కుంభ‌కోణం కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్టును నిర‌సిస్తూ ఆప్ ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ ఇంటి ముట్ట‌డికి ఇవాళ పిలుపునిచ్చింది. ఈ నేప‌థ్యంలో కేజ్రీవాల్ అరెస్టుకు నిర‌స‌న‌గా ఆందోళ‌న చేయ‌నున్నారు. దీంతో పోలీసులు అప్ర‌మ‌త్తమ‌య్యాయి.

- Advertisement -

కాగా, ఢిల్లీలో శాంతిభద్రతల దృష్ట్యా ఇవాళ ట్రాఫిక్‌కు అంతరాయం కలిగే అవకాశం ఉండటంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఈ సందర్భంగా న్యూఢిల్లీ ప్రాంతంలో ట్రాఫిక్ నిర్వహణ సజావుగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు. దీంతో పాటు నగరంలో ట్రాఫిక్ మళ్లీంపు చేపట్టారు. తుగ్లక్ రోడ్, సఫ్దర్‌జంగ్ రోడ్, కమల్ అతాతుర్క్ మార్గ్‌లలో ఎక్కడా ఏ వాహనం ఆపడానికి లేదా పార్కింగ్ చేయడానికి పర్మిషన్ లేదని పోలీసులు చెప్పారు. అలాగే, కమల్ అటా టర్క్ మార్గ్, సఫ్దర్‌జంగ్ రోడ్, అక్బర్ రోడ్, తీన్ మూర్తి మార్గ్ రూట్ లో ప్రయాణికులు వెళ్లొద్దని వారు సూచించారు.

అలాగే, రైల్వే స్టేషన్లు, ఇందిరాగాంధీ విమానాశ్రయం వైపు వెళ్లే ప్రయాణికులు తమ ప్రయాణాన్ని తగినంత సమయంతో జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలని పోలీసులు తెలిపారు. లేకుంటే వారు ఈ ట్రాఫిక్ లో తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని పేర్కొన్నారు. ఇక, ఢిల్లీలోని సాధారణ ప్రజలు, వాహనదారులు ఓపికగా ఉండాలని.. ట్రాఫిక్ నియమాలు పాటించాలని ఢిల్లీ పోలీసులు సూచించారు. అన్ని కూడళ్లలో మోహరించిన ట్రాఫిక్ సిబ్బంది సూచనలను పాటించాలని చెప్పుకొచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement