Monday, May 6, 2024

సెక్స్‌ వర్కర్లకు ఆధార్‌ కార్డులు.. గోప్యతను కాపాడాలని ఆదేశించిన సుప్రీంకోర్టు..

సెక్స్‌ వర్కర్లకు ఆధార్‌ కార్డుల ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దేశంలోని ప్రతి వ్యక్తికి గౌరవం పొందాల్సిన ప్రాథమిక హక్కు ఉందని సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. కరోనా సమయంలో సెక్స్‌ వర్కర్లు ఎదుర్కొన్న సమస్యలపై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. యూఐడీఏఐ జారీ చేసే ప్రొఫార్మా సర్టిఫికేట్‌ ఆధారంగా.. ఆధార్‌ కార్డులు ఇవ్వాలని సూచించింది.

అయితే.. సెక్స్‌ వర్కర్ల గుర్తింపును బహిర్గతం చేయకూడదని, వారి గోప్యతను కాపాడాలని జస్టిస్‌ లావు నాగేశ్వర రావు నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. సెక్స్‌ వర్కర్ల జాబితాను రూపొందించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీం ఆదేశించింది. రేషన్‌ అందనివారిని సైతం గుర్తించాలని స్పష్టం చేసింది. సీబీవో (కమ్యునిటీ బేస్డ్‌ ఆర్గనైజేషన్‌) గుర్తించిన సెక్స్‌ వర్కర్లకు ఓటర్‌ ఐడీలు సైతం ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని పేర్కొంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement