Tuesday, May 14, 2024

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి-రేపే రిలీజ్ డేట్ ఎనౌన్స్

హీరో సుధీర్ బాబు..ద‌ర్శ‌కుడు మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి కాంబినేష‌న్ లో వ‌స్తోన్న మూడో చిత్రం ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి. ఇందులో హీరో సుధీర్‌ బాబు సరసన కృతి శెట్టి నటిస్తున్నారు. వీళ్లిద్దరూ జంటగా నటిస్తున్న తొలి చిత్ర ఇదే కావడం గమనార్హం.ఇక తాజాగా ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌ చేసేందుకు ముహుర్తం ఖరారు చేసింది చిత్ర బృందం. ఆగ‌స్టు 10న ఉద‌యం 11.07 గంటలకు రిలీజ్‌ డేట్‌ ను అనౌన్స్‌ చేస్తున్నట్లు చిత్ర బృందం ఓ వీడియో ద్వారా తెలిపింది.అయితే.. ఇప్పటికే ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా నుంచి వచ్చిన పోస్టర్లు, సాంగ్స్‌ అందరిని ఆకట్టుకున్నాయి. సుధీర్‌ బాబు, దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటిది సూపర్‌ హిట్‌ కాంబినేషన్‌. ఇద్దరి కలయికలో వచ్చిన సమ్మోహనం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తర్వాత చేసిన వి ఓటీటీలో రిలీజ్‌ అయింది. అయితే.. ఇందులో సుధీర్‌ బాబును ప్యాక్డ్‌ బాడీలో చూపించిన విధానం అందరికీ నచ్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement