Wednesday, May 1, 2024

ఆన్​లైన్​ బెట్టింగ్ ​కు ఓ యువకుడి బలి

ఆన్​లైన్​ బెట్టింగ్స్​ ఓ కుటుంబంలో తీరని విషాదం మిగిల్చింది. చేతికి అంది వచ్చిన చెట్టంత కొడుకును ఆన్​లైన్​ బెట్టింగ్స్​ బలి తీసుకుంది. బీరువాలో దాచిన బంగారం కూడా కుదవపెట్టి బెట్టింగ్స్​లో ఓడిపోవడం… బీరువాలో దాచిన బంగారం తల్లికి కనిపించక నిలదీయడంతో తీవ్ర మనస్థాపానికి గురైన పెద్ద కొడుకు వేప చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నగరంలోని పహాడిషరీఫ్​ పోలీస్​స్టేషన్​ పరిధిలో తీవ్ర కలకలం రేపుతుంది. పహాడిషరీఫ్​ లోని మామిడిపల్లికి చెందిన చంద్రయ్య, శశికళ దంపతులకు ముగ్గురు కుమారులు.

పెద్దకుమారుడు రాజశేఖర్​ (26) ఇంటర్మీడియట్​ వరకు చదివి, గత కొంతకాలంగా శంషాబాద్​ ఎయిర్​పోర్ట్​లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. గత సంవత్సరం కాలంగా రాజశేఖర్​ ఆన్​లైన్​లో ప్లేయింగ్​ కార్డ్స్​, క్రికెట్​ బెట్టింగ్​లు ఆడేవాడు. ఆన్​లైన్​ బెట్టింగ్స్​కు భానిసై సంవత్సరకాలంలోనే మూడు నుంచి నాలుగు లక్షల వరకు డబ్బులు పోగొట్టుకున్నాడు. అంతటితో ఆగకుండా తల్లి శశికళ బీరువాలో దాచిపెట్టిన బంగారంను సైతం కుదవ పెట్టి ఆన్​లైన్​ బెట్టింగ్​లు ఆడి ఓడిపోయాడు. చివరకు తన బంగారంను కూడా కుదువపెట్టి బెట్టింగ్ లో పోగొట్టుకుని చేసేదేమీ లేక చివరకు యువకుడు ఓ వేపచెట్టుకు రాజశేఖర్​ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకొని ఉండడం కనిపించింది. ఈ ఘటనపై పహాడిషరీఫ్​ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement