Friday, May 10, 2024

హెల్మెట్లు మాకే నా మీకుండవా.. కట్టు జరిమానా !!

హెల్మెట్ మేము పెట్టుకోక పోతే ఫైన్ లు వేస్తారు. మీరు మాత్రం హెల్మెట్లు పెట్టుకోరా.. అంటూ పోలీసులకు ఎదురు తిరిగాడు ఓ యువకుడు. మీకు ఆ బాధ్యత లేదా అంటూ మండిపడ్డాడు. తన సెల్ ఫోన్ లోనే వీడియో తీస్తూ మీరు ఎందుకు హెల్మెట్ పెట్టలేదు… జరిమానాలు మాకేనా మీకు ఉండవా అంటూ రెచ్చిపోయాడు.

మీరు పాటించినప్పుడు మాకెలా జరిమానాలు విధిస్తారు అంటూ వీడియోను సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో చోటుచేసుకుంది. హెల్మెట్ లేకుండా పోలీసులు బైక్ పై రావడం గమనించిన యువకుడు పోలీసులతో గొడవకు దిగాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement