Wednesday, May 1, 2024

Breaking : మంత్రి గంగుల కమలాకర్ కు తప్పిన ప్రమాదం

బీఆర్ఎస్ మంత్రి గంగుల కమలాకర్ కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. కరీంనగర్ రూరల్ మండలం చెర్లబూట్కూర్ లో ఏర్పాటు చేసిన సభావేదిక ఒక్కసారిగా కుప్పకూలడంతో మంత్రి గంగుల సహా ఇతర నేతలు కిందపడిపోయారు. ఈ ప్రమాదంలో మంత్రి గంగుల కాలికి చిన్న గాయాలు కాగా జెడ్పిటీసీ సభ్యుని కాలు విరిగింది. దీంతో వెంట‌నే అత‌డిని హుటాహుటీన ఆసుపత్రికి తరలించారు. వేదికపైకి పరిమితికి మించి సంఖ్య రావడంతో కుప్పకూలినట్లు తెలుస్తుంది. కాగా ఈ ప్రమాదంపై మంత్రి గంగుల స్పందించారు. “నాకు చిన్న గాయమే అయింది. ప్రాథమిక చికిత్స కూడా చేశారు. విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారని” మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement