Friday, May 3, 2024

ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం.. తీవ్రత 7.1గా నమోదు

ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం సంభవించింది. ఉత్తర ఫిలిప్పీన్స్‌లోని లుజాన్‌ ఐలాండ్స్‌లో ఉన్నఅబ్రా ప్రావిన్స్‌లో ఈరోజు ఉదయం భూమి కంపించింది. దీని తీవ్రత 7.1గా నమోదయిందని యూఎస్‌ జియోలాజికల్‌ సర్వే వెల్లడించింది. దీంతో భూకంప కేంద్రానికి 300 కిలోమీట్ల దూరంలో ఉన్న మనీలాలో భారీ భవనాలు ఊగిపోయాయని తెలిపింది. భారీ భూకంపం నేపథ్యంలో డాలర్స్‌ పట్టణంలో ప్రజలు ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారని పోలీసులు తెలిపారు. భూ ప్రకంపణల వల్ల ఎంతమేర నష్టం జరిగిందనే విషయం తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement