Tuesday, April 23, 2024

వ‌రుస సినిమాల‌తో దూసుకుపోతున్న- హీరో విజ‌య‌కృష్ణ

డాలీ నిహారిక ప్రెజెంట్స్ విజ‌య‌శ్రీ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ లో ప్రేక్ష‌కుల ముందుకు రానున్న చిత్రం గోవింద భ‌జ గోవింద‌, ఈ చిత్రానికి ప్రొడ్యూస‌ర్ .. డైరెక్ట‌ర్ గా సూర్య‌కార్తికేయ వ్య‌వ‌హ‌రిస్తున్నారు. క‌థ‌ని కూడా ఆయ‌నే అందించారు. కాగా హీరో దుర్మార్గుడు ఫేమ్ విజ‌య‌కృష్ణ‌..హీరోయిన్ ప్రియా శ్రీనివాస్ న‌టిస్తున్నారు. ఈ చిత్రం గ్లింప్స్ ని ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు స‌ముద్ర‌గారి చేతుల మీదుగా రిలీజ్ చేశారు. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిధులుగా గ‌ణా మూవీ డైరెక్ట‌ర్ తాల్లూరి రాజ్..ప్ర‌ముఖ ఎడిట‌ర్ నంద‌మూరి హ‌రి ..ఎన్టీఆర్ విచ్చేశారు. ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు సూర్య మాట్లాడుతూ..ఈ చిత్రం త‌న మొద‌టి చిత్రమ‌ని తెలిపారు. త‌న డైరెక్ష‌న్ లో వ‌స్తోన్న ఈ చిత్రం హాస్య‌భ‌రితంగా ఉంటుద‌న్నారు.

ప్రేక్ష‌కులు కడుపుబ్బా న‌వ్వుతార‌ని ప్రేక్ష‌కుల‌కి హామీ ఇస్తున‌ని ద‌ర్శ‌కుడు తెలిపారు. అనంత‌రం హీరో విజ‌య‌కృష్ణ మాట్లాడుతూ..గోవింద భ‌జ గోవింద చిత్రం త‌న‌కి రెండ‌వ చిత్ర‌మ‌ని చెప్పారు. తాను హీరోగా న‌టించిన మొద‌టి చిత్రం దుర్మార్గుడు ఫుల్ యాక్ష‌న్ మూవీ అని తెలిపారు. రెండో చిత్రం ఔట్ అండ్ ఔట్ కామెడీ చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నామ‌న్నారు. కాగా త‌న సొంత బ్యానర్ ఎస్.కె.ఆర్ట్స్ బ్యాన‌ర్ లో గ‌ణా మూవీ షూటింగ్ పూర్త‌యింద‌ని..పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయ‌ని.. త్వ‌ర‌లోనే ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తామ‌ని వెల్ల‌డించారు. కాగా గోవింద భ‌జ గోవింద చిత్రానికి డీఓపీ కొల్లి మ‌నోహ‌ర్..మ్యూజిక్ ని ఆర్.జె.చ‌క్ర‌వ‌ర్తి అందించారు. కో డైరెక్ట‌ర్ శివ‌. కాగా ఈ చిత్రం రిలీజ్ కి సిద్ధంగా ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement