Friday, May 10, 2024

America కాలిఫోర్నియాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం – ఎనిమిది మంది మ‌ర‌ణం ..

అమెరికాలోని సెంట్రల్ కాలిఫోర్నియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇక్కడ ఓ వ్యాను లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందారు. ఈ ఘటన సెంట్రల్ కాలిఫోర్నియాలోని మదేరా సిటీలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుందని స్థానిక అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో వ్యాన్‌లో ప్రయాణిస్తున్న ఏడుగురు రైతులతో పాటు పికప్ ట్రక్కు డ్రైవర్ మరణించినట్లు పోలీసులు తెలిపారు.

కాగా, మదేరా సిటీ సమీపంలో ఉదయం 6:15 గంటలకు ప్రమాదం జరిగిందని సెంట్రల్ కాలిఫోర్నియా అధికారి జేవియర్ రువల్కాబా తెలిపారు. ఈ ప్రమాదంలో వ్యాన్ పూర్తిగా దెబ్బతినడం బాధాకరమన్నారు. ఈ ప్రమాదంలో వ్యాన్‌లో ప్రయాణిస్తున్న ఓ రైతు గాయపడ్డాడు.. అతన్ని చికిత్స కోసం స్థానిక ఆసుపత్రిలో చేర్చారని రువల్కాబా చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement