Thursday, May 2, 2024

ఎంఎస్సీ నర్సింగ్ కన్వీనర్ కోటా సీట్లకు 7,8, తేదిల్లో వెబ్ కౌన్సిలింగ్

వరంగల్, ప్రభన్యూస్ : ఎంఎస్సీ నర్సింగ్, ఎంపిటీ సీట్లభర్తీకి ఈ నెల 7,8 తేదిల్లో రెండవ విడత వెబ్ కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు కాళోజి నారాయణ రావు ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రకటించింది. మొదటి విడత తర్వాత మిగిలి పోయిన సీట్లభర్తీకి యూనివర్సిటీ బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. యూనివర్సిటీ పరిదిలో ని ఎంఎస్సీ నర్సింగ్, ఎంపిటీ, కళాశాల ల్లో కన్వీనర్ కోటా సీట్లను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.

ఈ నెల 7న ఉదయం8 గంటల నుంచి 8న మధ్యాహ్నం 2 గంటల వరకు తుది మెరిట్ జాబితాలో ని అర్హులైన విద్యార్థులు కళాశాల ల వారిగా ఆప్షన్లు నమోదు చేసుకోవాలని తెలిపింది. మెరిట్ జాబితా అదే విధంగా సీట్ల ఖాళీ ల వివరాలు వెబ్ సైట్ లో పొందుపర్చినట్లు పూర్తి సమాచారం కోసం యూనివర్సిటీ వెబ్ సైట్ చూడాలని తెలిపింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement