Wednesday, May 1, 2024

నాకో బాయ్ ఫ్రెండ్ కావాలి…పేపర్ లో 73 ఏళ్ల బామ్మ ప్రకటన

మామూలుగా మనం ఎవరికైనా పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పాలన్నా… పెళ్లిరోజు శుభాకాంక్షలు చెప్పాలన్నా పేపర్ లో ప్రకటనలు వేస్తూ ఉంటాం. అంతేకాకుండా ఏవైనా షాప్స్ ఓపెనింగ్ కి సంబంధించి కూడా పేపర్ లో ప్రకటనలు ఇస్తూ ఉంటాం. కానీ కర్ణాటక కు చెందిన ఓ బామ్మ ఇచ్చిన ప్రకటన ఇప్పుడు సోషల్ మీడియాలో నెటిజన్లను ఆకట్టుకుంటుంది. నా వయసు 73 ఏళ్లు. నాకు ఒక తోడు కావాలి అంటూ ప్రకటన ఇచ్చింది. మైసూరుకు చెందిన ఈ వృద్ధురాలు భర్తతో ఇటీవల విడాకులు తీసుకుంది.

ఒంటరిగా ఉండలేక పోతున్నాను, శేష జీవితమంతా కలిసి ఉండేందుకు ఒక తోడు కావాలని ఆమె తెలిపింది. తన కన్నా పెద్దవాడు ఆరోగ్యవంతుడైన వ్యక్తి భర్తగా కావాలని పేపర్ ప్రకటన ఇచ్చింది. కాదా తనది బ్రాహ్మణ కులం కాబట్టి కాబోయే భర్త తప్పనిసరిగా బ్రాహ్మణుడు అయి ఉండాలని షరతు కూడా పెట్టింది. ఈ ప్రకటన చూసిన నెటిజన్లు బామ్మ పై సెటైర్లు వేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement