Saturday, May 4, 2024

దేశంలో కరోనా విలయతాండవం..

భారత్‌లో కరోనా కేసులు మళ్లి పెరుగుతున్నాయి. నిన్న మొన్నటి వరకు 17 వేల నుంచి 18 వేల వరకు నమోదైన కేసులు ఇప్పుడు 20 వేలపైకి చేరుకున్నాయి. నిన్న దేశవ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల సంఖ్య 22 వేలు దాటింది. గడిచిన 24 గంటల్లో 22 వేల 8 వందల 54 కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,12,85,561 కు చేరుకున్నాయి. నిన్న కరోనా నుంచి కోలుకుని 18,100 మంది డిశ్చార్జి అయ్యారు. ఇప్పటి వరకు 1,09,38,146 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 1,89,226 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇక 24 గంటల్లో 126 మంది మరణించారు.

ఇక తెలంగాణలో కొత్తగా 194 కరోనా కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. గత 24 గంటల్లో కరోనాతో ముగ్గురు చనిపోయారు. ఇక 124 మంది నిన్న కరోనా నుంచి కోలుకున్నారు. తెలంగాణలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,00,536 కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,97,032 మంది కోలుకున్నారు. మరణించిన వారి సంఖ్య 1,649 గా ఉంది. తెలంగాణలో ప్రస్తుతం 1,855 మంది కరోనాకు చికిత్స తీసుకుంటున్నారు. వారిలో 730 మంది హోం క్వారంటైన్‌లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్‌ఎసీలో కొత్తంగా 35 కేసులు నమోదయ్యయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement