Tuesday, May 21, 2024

వచ్చే వారం నుంచి ఐఫోన్‌లో 5జీ

దేశంలో 5జీని సపోర్టు చేసే ఐఫోన్లకు వచ్చే వారం సాఫ్ట్‌వేర్‌ ఆప్‌డేట్‌ ఇవ్వనున్నామని యాపిల్‌ తెలిపింది. ప్రయోగాత్మక పరీ క్షల్లో భాగంగా తొలుత బీటా వెర్షన్‌ మాత్రమే ఇవ్వనున్నట్లు పేర్కొంది. 5జీ నెట్‌వర్క్‌ అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో నాణ్యత, వేగం ఎలా ఉందో వినియోగదారులు తెలియచేయాలని యాపిల్‌ కోరింది. యూజర్ల స్పందనను బట్టి మార్పులు అవసరమైతే చేస్తామని తెలిపింఇ. డిసెంబర్‌లో తుది అప్‌డేట్‌ను వినియోగాదారులందరికీ అందిస్తామని ప్రకటించింది. ప్రస్తుతం ఐఫోన్‌ 12, ఐఫోన్‌ 13, 14 సిరీస్‌లతో పాటు ఐఫోన్‌ ఎస్‌ఈ ఫోన్లు 5జీ సామర్ధ్యం కలిగి ఉన్నాయి. వీటిని ఎయిర్‌టెల్‌, జియో 5జీ నెట్‌వర్క్‌లపై యాపిల్‌ పరీక్షిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement