Saturday, April 20, 2024

ప్ర‌పంచ వ్యాప్తంగా 530 కోట్ల ఫోన్లు పక్కన ప‌డేస్తార‌ట‌..! స‌ర్వేలో వెల్ల‌డి..

ప్రపంచ వ్యాప్తంగా ఈ సంవత్సరం దాదాపు 530 కోట్ల సెల్‌ఫోన్లను వినియోగదారులు పక్కన పెట్టే అవకాశం ఉందని ఒక నివేదిక వెల్లడించింది. వీటిలో చాలా తక్కువ ఫోన్లు మాత్రమే సరైన పద్ధతిలో రీసైక్లింగ్‌ చేసేందుకు వస్తాయని తెలిపింది. ఎలక్ట్రానిక్‌ పరికరాలను రీపేర్ చేసి వినియోగంలోకి తీసుకురావడంలో ప్రజలు, వ్యాపారులు ఎందుకు విఫలమవుతున్నారో తెలుసుకునేందుకు బ్రసెల్స్‌కు చెంది వేస్ట్‌ ఎలక్ట్రిక్‌ అండ్‌ ఎలక్ట్రానిక్‌ ఎక్విప్‌మెంట్‌ (డబ్ల్యూఈఈఈ) ఫోరమ్ సర్వే చేసింది. జూన్‌ నుంచి సెప్టెంబర్‌ మధ్య నిర్వహించిన ఈ సర్వేలో ఐదు ఐరోపా దేశాలు పోర్చుగల్‌, నెదర్లాండ్స్‌, ఇటలీ, రొమేనియాలకు చెందిన 7,775 మంది పాల్గొన్నారు. సామాన్య కుటుంబం తమ ఇంట్లో ఫోన్లు, ట్యాబ్లెట్‌లు, ల్యాప్‌టాప్‌లు, ఎలక్ట్రిక్‌ టూల్స్‌, హెయిర్‌ డ్రయిర్స్‌, టోస్టర్‌ వంటి ఉపకరణాలతో సహా 74 ఇ-ఉత్పత్తులను వినియోగిస్తున్నారు. ఇందులో 9 ఉత్పత్తులు పని చేస్తున్నప్పటికీ వాడటం లేదని, 4 వస్తువులు పాడైపోయినట్లు నివేదిక తెలిపింది. పాడవుతున్న ఫోన్లను 9 మిల్లి మీటర్ల సగటు దూరంలో ఒకదాని పక్కన ఒకటి పేర్చుకుంటూ పోతే దాదాపు 50 వేల కిలోమీటర్ల దూరం వస్తాయని అంచనా. ఇళ్లలో వినియోగించని ఇటువంటి వస్తువులు సాధారణ చెత్తలోకి వెళ్లిపోతున్నాయి. వీటికి చాలా విలువ ఉంటుందన్న విషయాన్ని ప్రజలు గుర్తించాలని డబ్ల్యూ ఈఈఈ ఫోరమ్‌ డైరెక్టర్‌ జనరల్‌ పాస్కల్‌ లెరాయ్‌ చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement