Sunday, May 5, 2024

Delhi | చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్ కల్పించాలి.. బీసీ సంక్షేమ సంఘం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : చట్టసభల్లో వెనుకబడిన వర్గాల వారికి 50 శాతం రిజర్వేషన్ కల్పించాలని, ఉద్యోగాలు, ప్రమోషన్లలోనూ రిజర్వేషన్ కల్పించాలని బీసీ సంక్షేమ సంఘం డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన బీసీ సంక్షేమ సంఘం ప్రతినిధులు శనివారం న్యూఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్‌లో ఉన్న గురుజాడ కాన్ఫరెన్స్ హాల్‌లో సమావేశమయ్యారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడిగా గండిచెర్వు వెంకన్న గౌడ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

- Advertisement -

ఈ సందర్భంగా వెంకన్న మాట్లాడుతూ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో పర్యటిస్తూ బీసీలను చైతన్యం చేస్తూ బీసీల పక్షాన పోరాటం చేస్తానని చెప్పుకొచ్చారు. బీసీల హక్కుల సాధనకు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యదర్శి పేటి పెద్దిరాజు, హై కోర్ట్ అడ్వకేట్ ప్రసాద్ సాగరపుతో పాటు పలువురు జాతీయ నాయకులు పాల్గొన్నారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement