Sunday, April 28, 2024

తెలంగాణలో 24 గంటల్లో 46 మంది మృతి…

తెలంగాణ లో రోజురోజుకు కరోనా టెస్ట్ లను తగ్గిస్తున్నారు. తాజాగా 76,047 టెస్ట్ లు చేయగా 5,892 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. మరోవైపు చికిత్స పొందుతూ 46 మంది మ‌ర‌ణించారు.
తాజా గణాంకాల ప్రకారం రాష్ట్రంలో ప్రస్తుతం 73,851 యాక్టివ్ కేసులుండ‌గా… ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌స్తుతం 4,05,164 కరోనా నుండి కోలుకున్నారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 2,625 మంది కరోనా కారణంగా మృతిచెందారు. రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం 4,81,640మంది వైర‌స్ బారిన ప‌డ్డారు.

ఇక కొత్తగా నమోదు అయిన కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలో మరో 1,104, మేడ్చల్‌ జిల్లాలో 378, రంగారెడ్డి జిల్లాలో 443, ఇటీవ‌ల ఎన్నిక‌లు జ‌రిగిన వ‌రంగ‌ల్ అర్బ‌న్ జిల్లాలో 321 కరోనా కేసులు న‌మోద‌య్యాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement