Sunday, April 28, 2024

జంట నగరాల్లో కొత్తగా 40 పోలీస్‌ స్టేషన్లు.. ఉత్తర్వులు జారీ

ఆంధ్రప్రభ, హైదరాబాద్‌ : జంటనగరాల్లో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. ఇప్పటికేఉన్న పోలీస్‌ స్టేషన్లకు అదనంగా మరి కొన్ని కొత్త పోలీస్‌ స్టేషన్లను ఏర్పాటు చేస్తోంది. హైదరాబాద్‌, – సికింద్రాబాద్‌ జంట నగరాల పరిధిలో కొత్తగా 40 పోలీస్‌ స్టేషన్లు ఏర్పాటుకానున్నాయి. ఈ మేరకు శనివారం ప్రభుత్వం ఉత్తర్వులు (జీఓ) జారీ చేసింది.

హైదరాబాద్‌ పరిధిలో దోమలగూడ, సెక్రెటేరియట్‌, ఖైరతాబాద్‌, వారాసి గూడ, బండ్లగూడ, ఐఎస్‌ సదన్‌, గుడి మల్కాపూర్‌, ఫిలింనగర్‌, మధురానగర్‌, మాసబ్‌ ట్యాంక్‌, బోరబండ, సైబరాబాద్‌ పరిధిలో మోకిలా, అల్లాపూర్‌, సూరారం, కొల్లూరు, జినోమ్‌వ్యాలీలో కొత్త పోలీస్‌ స్టేషన్లు ప్రారంభమవుతున్నాయి. అదే విధంగా11 లా అండ్‌ ఆర్డర్‌ ,13ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్లు, రెండు టాస్క్‌ పోర్స్‌ జోన్లు ఏర్పాటు చేస్తున్నారు.

- Advertisement -

దాంతోపాటు ఆరు డీసీపీ జోన్‌లు, ప్రతి ఏరియాలో సైబర్‌ క్రైమ్‌, నార్కోటిక్‌ వింగ్‌ను సైతం ఏర్పాటు చేస్తున్నారు. కొత్తగా మేడ్చల్‌ , రాజేంద్రనగర్‌,మహేశ్వరం టాస్క్‌ ఫోర్స్‌ జోన్లు ఏర్పాటవుతున్నాయి. హైదరాబాద్‌లో 12 ఏసీపీ డివిజన్లు, సైబరాబాద్‌లో3 డీసీపీ జోన్లు ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి జోన్‌కు ఒక మహిళా పోలీస్‌ స్టేషన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement