Monday, April 29, 2024

కాంగ్రెస్ ప్లీన‌రీలో 2024 ఎన్నిక‌ల మ్యానిఫెస్టో…

న్యూఢిల్లి: ఈనెల 24 నుంచి26వ తేదీ వరకూ చత్తీస్‌గఢ్‌ రాజధాని రాయ్‌పూర్‌ లో జరిగే పార్టీ 85వ ప్లీనరీ సమావేశాలకు కాంగ్రెస్‌ సంసిద్ధమవుతున్నది. పార్టీ సీనియర్‌ నాయకుడు జైరామ్‌ రమేష్‌ నేతృత్వం లో మేనిఫెస్టో ముసాయిదా తయారీ కమిటీ ఏర్పాటు అయింది. రాజకీయ,ఆర్థిక అంశాలపై మాజీ కేంద్ర మంత్రులు వీరప్ప మొయిలీ, పి.చిదంబరంల నేతృత్వం లో కమిటీలను ఎఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే నియమించారు. 2024పార్లమెంటు ఎన్నికలకు మినీ మేనిఫెస్టోనితయారు చేసే అంశంపై ఈ సమావేశాల్లో చర్చించి నిర్ణయం తీసుకుంటారు. పార్టీ అనుసరిం చాల్సిన విధానాలపై పార్టీలోని వివిధ వర్గాల నుంచి సీనియర్‌ నాయకులు అభిప్రాయ సేకరణ జరుపుతున్నారు.


అధ్యక్ష పదవికి ఖర్గేపై పోటీ చేసిన శశి థరూర్‌ ఉపసంఘాల కన్వీనర్‌గా వ్యవహరిస్తున్నారు. బీజేపీ వైఫల్యాలపై సమరానికి పార్టీని సమాయత్తం చేయడం కోసం ఈ సమావేశాల్లో నిర్ణయాలు తీసుకుంటారు. వీలైనన్ని ఎక్కువ రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చేందుకు పార్టీని సమాయత్తం చేయాలని పార్టీ నిర్ణయించింది. పార్టీలోని వివిధ వర్గాల మధ్య ఐక్యతా సాధన ప్రధాన లక్ష్యంగా పార్టీ కార్యకర్తలు, శ్రేణులు కృషి చేయాలని ఈ ప్లీనరీ సందర్భంగా పార్టీ పిలుపు ఇవ్వనున్నది.

Advertisement

తాజా వార్తలు

Advertisement