Tuesday, May 28, 2024

18 ఏళ్ల క్రికెట్ కెరీర్‌కు తెర.. రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన ఇంగ్లండ్ బౌలర్‌

ఇంగ్లండ్ క్రికెట్ టీం నుండి ఇవ్వాల (సోమ‌వారం) మ‌రో ఆట‌గాడు రిటైర్మెంట్ ప్ర‌క‌టించాడు. గ‌డిచిన నెల రోజుల వ్య‌వ‌ధిలో ఇంగ్లండ్ జ‌ట్టు నుండి ఇది నాలుగో రిటైర్మెంట్ ఎంనౌన్స్ మెంట్. మూడుసార్లు యాషెస్ విజేతగా నిలిచిన ఇంగ్లండ్ మాజీ ఫాస్ట్ బౌలర్ స్టీవెన్ ఫిన్ ఇవ్వాల (సోమవారం) రిటైర్మెంట్ ప్రకటించాడు.

ఫిన్ 2010, 2016 మధ్య ఇంగ్లండ్ తరపున 36 టెస్ట్ మ్యాచ్‌లలో 30.4 సగటుతో 125 వికెట్లు తీశాడు. 34 ఏళ్ల అతను ఇంగ్లండ్ తరపున 69 వన్డేలు, 21 20-20 అంతర్జాతీయ మ్యాచ్‌లు కూడా ఆడాడు.

అయితే వివిధ గాయాల కారణంగా, ఫిన్ ఇంగ్లాండ్ జట్టు నుండి తప్పుకున్నాడు. జూలై 2022 జ‌రిగిన‌ రెడ్-బాల్ క్రికెట్ ఆడలేదు. “నేను గత 12 నెలలుగా నా శరీరంతో పోరాడుతున్నాను.. ఇక‌ దానితో పోరాడ‌లేక‌ ఓటమిని అంగీకరించాను” అని ఫిన్ చెప్పాడు. దీర్ఘకాల మోకాలి సమస్య నుండి కోలుకోవడానికి అతని ప్రయత్నంలో.. అతని 18 సంవత్సరాల కెరీర్‌కు తెర దించవలసి వచ్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement