Thursday, April 25, 2024

18పేజెస్ ట్రైల‌ర్ రిలీజ్.. ఎప్పుడంటే

ప‌ల్నాటి సూర్య ప్ర‌తాప్ తెర‌కెక్కిస్తోన్న చిత్రం 18పేజెస్.ఈ చిత్రం ట్రైల‌ర్ ని రిలీజ్ చేయ‌నున్నారు మేక‌ర్స్.ఈ చిత్రంలో హీరోగా నిఖిల్..హీరోయిన్ గా అనుప‌మ‌ప‌ర‌మేశ్వ‌ర‌న్ న‌టిస్తున్నారు. 18 పేజెస్‌ చిత్రానికి స్టార్ డైరెక్టర్ సుకుమార్ స్టోరీనందిస్తున్నారు. ఈ రొమాంటిక్ కామెడీ ఎంట‌ర్‌ టైన‌ర్‌ డిసెంబర్‌ 23న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది. కాగా విడుదల తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో 18 pages ట్రైల‌ర్ ఎప్పుడనేది తెలియజేశారు మేక‌ర్స్.

డిసెంబర్ 17న ట్రైలర్ రాబోతున్నట్టు పుస్తకంలోని పేజీపై డిస్‌ప్లే చేస్తూ సరికొత్తగా ప్రకటించారు. 18 పేజెస్‌ చిత్రానికి గోపీసుందర్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే 18 పేజెస్‌లో కోలీవుడ్‌ స్టార్ హీరో శింబు పాడిన టైం ఇవ్వు పిల్లా సాంగ్‌ అందరినీ ఆకట్టుకుంటోంది.ఈ మూవీ పోస్ట్‌ థ్రియాట్రికల్ రైట్స్ ఫ్యాన్సీ ధరకు అమ్ముడుపోయినట్టు సమాచారం. 18 పేజెస్‌ పోస్ట్‌ థ్రియాట్రికల్‌ రైట్స్ ను నెట్‌ఫ్లిక్స్‌, ఆహా.. శాటిలైట్‌ రైట్స్ ను జీ ఛానల్‌ దక్కించుకున్నట్టు ఇన్‌సైడ్‌ టాక్‌. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్‌ సమర్పణలో గీతా ఆర్ట్స్‌ 2-సుకుమార్‌ రైటింగ్స్‌ బ్యానర్లపై సంయుక్త నిర్మాణంలో బన్నీవాసు తెరకెక్కిస్తున్నారు.

https://www.youtube.com/watch?v=WoCLFZ6xqrI&t=3s
Advertisement

తాజా వార్తలు

Advertisement